టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నుంచి మనందరికీ తెలిసిందే.వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో కలిసి నటించిన విషయం మనందరికీ తెలిసిందే.
బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలలో నటించి మంచి పెయినర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
వీరిద్దరి పెళ్లి విషయంలో ఎన్నో రకాల రూమర్స్ కూడా వినిపించాయి.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ అనుష్క శెట్టి, ప్రభాస్ కి మధ్య ఉన్న రిలేషన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మెహర్ రమేష్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన అరుంధతి సినిమా విడుదల విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే అనుష్క ఈ సినిమాలో నటించిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో హీరోయిన్ గా నటించింది.
అనుష్క అరుంధతి సినిమా చేసిన తర్వాత సినిమా బిల్లా.

అరుంధతి సినిమాలో జేజమ్మ లాంటి ఒక గొప్ప క్యారెక్టర్ లో నటించింది అనుష్క.తర్వాత బిల్లా సినిమాలో బికినీ వేసుకొని అందాలను ఆరబోసింది.మెహర్ రమేష్ అనుష్క ప్రభాస్ ల గురించి మాట్లాడుతూ.
వారిద్దరి కెమిస్ట్రీ గురించి చెప్పాలి అంటే ఆ ఇద్దరు నేషన్స్ బెస్ట్ ఫెయిర్.బిల్లా సినిమా అనే కాదు ఆ తర్వాత వచ్చిన మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 లాంటి సినిమాలలో కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అని చెప్పుకొచ్చారు దర్శకుడు మెహర్ రమేష్.







