మాదకద్రవ్యాల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.రాష్ట్రంలో గంజాయి సాగుపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని పేర్కొన్నారు.ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా రూ.9,251 కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేసినట్లు ఆమె వెల్లడించారు.అదేవిధంగా మహిళల భద్రత పట్ల సీఎం జగన్ శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉందని స్పష్టం చేశారు.







