నెల్లూరు: మాజీ మంత్రి అనిల్ ని వదలని లోన్ యాప్ మాఫియా.అనిల్ కి కాల్స్ చేసి అశోక్ అనే వ్యక్తి గురించి ఆరా.
ఆయన మీ బావమరిది అంటూ రెచ్చిపోయిన టెలికాలర్. డబ్బులు ఎవ్వరు కాడుతారంటూ అడగడం.తనకి సంబంధం లేదని మొత్తుకున్న మాజీ మంత్రి అనిల్. తాను మాజీ మంత్రి అని చెప్పినా వినని వైనం.
బ్యాంకుకు వచ్చి మాట్లాడుతాం అని చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మహిళ.ఇదే కాల్స్ మంత్రి కాకాణికి కూడా రావడంతో ఇద్దరు వేర్వేరుగా ఎస్పీకి ఫిర్యాదు.
చెన్నైకి చెందిన కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.వైరల్ గా మారిన అనిల్ తో టెలికాలర్ ఏజంట్ మాట్లాడిన రికార్డింగ్.







