మన దేశంలో గోవులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా బీజేపీకి పేరుంది.అయితే చత్తీస్‌ఘడ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం గోవును తలకెత్తుకుంటోంది.
ఇటీవల కాలంలో గోవుల పెంపకాన్ని ఆ రాష్ట్రంలో ప్రోత్సహిస్తోంది.ఇందులో భాగంగా ఆవుల నుంచి పేడ, మూత్రం సేకరిస్తోంది.
వాటికి కొంత మొత్తం చెల్లించి, పాడి రైతులకు ఆర్థికంగా దన్ను కల్పిస్తోంది.ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గోమూత్రం సేకరణకు ఆమోదం తెలిపింది.
గోధన్ న్యాయ్ యోజన పథక పరిధిని పొడిగించింది.నర్వా గర్వ ఘుర్వా బారిలో భాగంగా గోధన్ న్యాయ్ యోజన పథకం కింద తాము ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు సీఎం భూపేష్ బాఘేల్ తెలిపారు.ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేసి కంపోస్ట్‌గా మారుస్తున్నామని, గోమూత్రాన్ని కూడా లీటరుకు రూ.4 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించారు.ఈ పథకాన్ని కేబినెట్ ఆమోదించిందన్నారు.హరేలీ (రైతు పండుగ) రోజైన జూలై 28న ప్రతి జిల్లాలో రెండు ప్రాంతాలలో దీనిని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
నర్వ గర్వ బరి పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు దానిని మరింత స్వయం సమృద్ధిగా మార్చడానికి చేసిన ప్రయత్నమని ప్రభుత్వం పేర్కొంది.నాలుగు ఛత్తీస్‌గఢ్ పదాల నుండి ఈ పేరు వచ్చింది.
నర్వా అంటే నది, గర్వ అనేది జంతువులను సూచించే పదం, ప్రధానంగా పశువులు, ఘుర్వ అనేది పేడను సూచిస్తుంది.బారి అనేది ప్రజలు కూరగాయలు పండించే గ్రామ తోటలకు సంబంధించిన పదం. గోధన్ న్యాయ్ యోజన కింద, ప్రతి గ్రామంలో పెంపుడు పశువులను ఉంచడానికి ‘గౌతాన్లు‘ లేదా ఆవుల షెడ్లను నిర్మించారు.పొలాల్లో పశువుల మేత సమస్య నుంచి రైతులకు ఉపశమనం కలిగించడమే కాకుండా అదే సమయంలో ఆవు పేడతో వర్మీ కంపోస్ట్, సూపర్ కంపోస్ట్, సూపర్ కంపోస్ట్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన.
ఆవు మూత్రం, పురుగుమందుల తయారీకి ఉపయోగించనున్నారు.








