టాలీవుడ్ చందమామ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కాజల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.
తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.మొదటి లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ మగధీర మూవీతో స్టార్ హీరోయిన్ గా మారింది.
ఆ సంగతి పక్కన పెడితే కాజల్ 2020 లో ముంబయికి చెందిన గౌతమ్ కిచ్లూ( Gautam Kitchlu ) అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది.

వీరికి ఒక మగబిడ్డ కూడా జన్మించాడు.పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న కాజల్ కి ఛాన్సులు తగ్గిన మాట వాస్తవమే.అయినా కూడా ఈమెకు ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.
ఇకపోతే కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సత్యభామ.( Satyabhama Movie ) ఈ సినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉంది కాజల్.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ సౌత్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆ వివరాల్లోకి వెళితే…

బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ మధ్య చాలా తేడా ఉంది.దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్లని( Married Heroines ) బాగా లేరని పక్కన పెట్టేస్తారు.అదే హిందీలో మాత్రం పెళ్లయినా సరే హీరోయిన్లుగా నటిస్తుంటారు.షర్మిళా ఠాకుర్, హేమమాలిని మొదలుకొని దీపికా పదుకొణె, ఆలియా భట్ లాంటి వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలు వస్తున్నాయి.
కానీ దక్షిణాదిలో అలాంటి పరిస్థితి లేదు.దీనికి నయనతార అతీతం.
ఆమె మంచి సినిమాలు చేస్తోంది.కాగా దక్షిణాదిలో నెలకొన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.
కాజల్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు ఆమె మాటలను తప్పుపడుతున్నారు.







