నా తొలి మద్దతు వారికేనంటున్న వై.ఎస్.షర్మిల

తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నానంటూ వై.ఎస్.షర్మిల చెప్పడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖపోరే తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్న తరుణంలో షర్మిల పార్టీ రాజకీయ రణరంగాన్ని మరింత రసవత్తరంగా మార్చనుంది.

 My First Support Was For Tribals Only Says Ys Sharmila, Sharmila New Party,telan-TeluguStop.com

ఇప్పటివరకు పార్టీ విధి, విధానాలు ఏమీ ప్రకటించకపోయినా పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనులు విస్తృతంగా జరుగుతున్నాయి.అయితే ఇప్పటికే రాజకీయపరమైన వ్యాఖ్యలను చేస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.గిరిజన తండాల బోర్డు ఏర్పాటు చేయాలని, గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించాలని, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వై.ఎస్.షర్మిల కోరారు.ఇక నా మద్దతు గిరిజనులకు ఉంటుందని వై.ఎస్.షర్మిల ప్రకటించారు.అయితే ఇప్పటికే గిరిజనులకు సంబంధించిన పోడు భూముల సమస్య పెండింగ్ లోనే ఉంది.

ప్రభుత్వం పరిష్కరిస్తామని పలు మార్లు చెప్పినప్పటికీ, ఆ హామీ అమలు దిశగా ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, గిరిజనులకు నా మద్దతు ఉంటుందని ప్రకటించిన వై.ఎస్.షర్మిల పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గల మెత్తుతుందో లేదో చూడాల్సి ఉంది.

Telugu Sharmila, Telangana, Tribal, Ys Sharmila-Telugu Political News .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube