మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మన దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటారు.ధనుర్మాసంలో వచ్చే ఈ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులందరితో ఎంతో ఆనందంగా ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసి ఇంటిని రంగురంగుల పువ్వులతో అలంకరించి రకరకాల పిండి వంటలు, హరిదాసు, గీతాలు, గంగిరెద్దుల కోలాహలం ఈ సంక్రాంతి పండుగకు ఎంతో ప్రత్యక్షమైనది.
సంక్రాంతి పండుగ జరుపుకునే మూడు రోజులపాటు మొదటి రోజు భోగి పండుగ, ఈ పండు భోగి పండుగ రోజున భోగి మంటలు వేయడం ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు.ఇక హరిదాసు, కోళ్ల పందాలు, గంగిరెద్దుల కోలహాలను కూడా ఎంతో ప్రత్యేకమైనవే.

అయితే సంక్రాంతి పండుగ రోజున ఇలా గంగిరెద్దులు కోలహాలు చేయడానికి గల కారణం వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ సంప్రదాయం ప్రకారం సంక్రాంతి పండుగ రోజున గంగిరెద్దులు సంచరించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు.అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడగగా తన గర్భంలో ఉండాలని గజాసురుడు కోరుకోవడంతో అతని కోరిక మేరకు పరమశివుడు గజాసురుని గర్భంలోకి ప్రవేశించాడు.
అయితే తన పతి పరమేశ్వరుడు కనిపించకపోవడంతో పార్వతీదేవి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి విచారించ సాగింది.

అప్పుడు విష్ణుమూర్తి శివుని వాహనమైన నందీశ్వరుని రూపంలో గంగిరెద్దు మారువేషంలో సకల దేవతలతో కలిసి వాయిద్యాలతో గజాసురుడు ముందుకు వెళ్లి నాట్యం ఆడారు. విష్ణుమూర్తి నాట్యానికి మంత్రముగ్ధుడైన గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పగా వెంటనే గంగిరెద్దుల ఉన్న విష్ణుమూర్తి తన వెంటనే తన స్వామిని తన చెంతకు పంపించు అని అడుగుతాడు.ఇలా అడగడంతో వెంటనే తేరుకున్నా గజాసురుడు వచ్చింది విష్ణుమూర్తి అని గ్రహించాడు.ఆ తర్వాత విష్ణు ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు గజాసురుడి గర్భాన్ని చీల్చడంతో శివుడు బయటకు వస్తాడు.
మాట తప్పని గజాసురుని ప్రజలందరూ పూజించాలని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున గజసురుడివేషంలో ప్రతి ఇంటికి తిరుగుతాడు.