రిలీజ్ డేట్ మార్చుకున్న 'టిల్లు స్క్వేర్'.. కొత్త డేట్ ఎప్పుడంటే?

గత ఏడాదిలో మన టాలీవుడ్ ( Tollywood )బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాల్లో ”డీజే టిల్లు” ( DJ Tillu )కూడా ఉంది.ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

 Tillu Square Postpones The Release Date, Tillu Square, Siddhu Jonnalagadda, Dj T-TeluguStop.com

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ( Siddhu Jonnalagadda ) హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు.ఈ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేసిందో అందరికి తెలుసు.

ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టరనే చెప్పాలి.

డైరెక్టర్ విమల్ కృష్ణ( Director Vimal Krishna ) ఈ సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా బాగా అలరించడంతో దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే సీక్వెల్ అనౌన్స్ చేయగా ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.

అయితే ఈసారి ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు ‘టిల్లు సీక్వెల్’ ( Tillu Sequel )అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు.

ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) ను ఎంపిక చేసారు.ఈ జోడీ ఎలా ఉంటుందో చూడాలని ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ డిసిషన్ ను మార్చుకున్నారని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయకుండా మరో కొత్త డేట్ ను పరిశీలిస్తున్నట్టు టాక్.మరి ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.ఎందుకంటే సెప్టెంబర్ లో భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

దీంతో ఈ పోటీలో రిలీజ్ చేయడం కంటే ఆ తర్వాత రిలీజ్ మంచిది అని మేకర్స్ భావిస్తున్నారట.చూడాలి మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube