బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలినటువంటి తారలలో నటి కాజోల్( Kajol ) ఒకరు.ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో కాజోల్ సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె లస్ట్ స్టోరీస్2( Lust Stories 2 ) లో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కాజోల్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు తెలియజేశారు.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె పలు సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తుంటారు.ఈ క్రమంలోనే ఇలా తల్లి పాత్రలలో నటించినప్పుడు తాను రియల్ లైఫ్ లో తల్లిగా ఎలా ఫీల్ అవుతానో రీల్ లైఫ్ లో కూడా అలాగే ఫీలవుతూ నటిస్తానని తెలిపారు.అయితే రీల్ మదర్, రియల్ మదర్ వేరని, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పింది.
కానీ తెరపై సహజంగా నటించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొంది. ఇక ఈ సందర్భంగా తన పిల్లల గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

నేను సినిమాలలో నటించడం ముందుగా నా పిల్లలకు ఏమాత్రం ఇష్టం లేదని కాజల్ తెలియజేశారు.అయితే నేను నటించిన సినిమాలను చూడటానికి నా పిల్లలు ఏమాత్రం ఇష్టపడరు అని, వారిని బలవంతంగా కూర్చోబెట్టి నేను చేసిన సినిమాలు చూపించిన వారు చూడరు అంటూ ఈమె కామెంట్ చేశారు.అయితే నా పిల్లలే కాకుండా మా సమీప బంధువులలో చాలామంది నా సినిమాలను చూడటానికి ఇష్టపడరు.కొన్ని సందర్భాలలో నేను చాలా బాధపడుతూ ఏడుస్తూ నటించడం జరుగుతుంది.
అలా తనని ఏడుస్తూ చూడటం కష్టమని భావించి చాలామంది మా బంధువులు నా సినిమాలు చూడరని ఈమె తెలియజేశారు.







