ఇక జనసేన దారి ' రహదారి ' ?

ఏపీలో జనసేన రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.పార్టీ పెట్టి చాలా కాలం అయినా, రాజకీయం కోసం ఇప్పటికీ పోరాడుతోంది.

 Janasena, Pavan Kalyan, Ysrcp, Ap, Ap Government, Ap Road Problems, Tdp, Bjp, Ja-TeluguStop.com

వివిధ సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ రంగానికి చెందిన వారు కావడంతో, ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఏపీలో సమస్యలపైన స్పందిస్తున్నారు.

తాను పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా, పార్టీ నాయకుల ద్వారా జనసేన వాయిస్ జనాల్లోకి తీసుకువెళ్లి తను పంతం నెరవేర్చుకోవాలనే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారు.ఏపీలో 2019 ఎన్నికల్లో జనసేనకు ఘోర పరాభవం ఎదురైనా, దాని నుంచి తొందరగానే కోలుకున్నారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ సమస్యలపై జనసేన ఫోకస్ పెట్టి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసినా, ఆ తర్వాత ఆ దూకుడు తగ్గించింది.

ప్రస్తుతం జనసేన తరపున పోతిన మహేష్ నాదెండ్ల మనోహర్ తదితరులు యాక్టివ్ గా ఉంటున్నారు.

వివిధ సమస్యలపై వారు స్పందిస్తూ వస్తున్నారు.ఈ విధంగా వ్యవహరించడం వల్ల జనసేన పై జనరల్లో ఆదరణ పెరుగుతుందని వారు గుర్తించారు.

ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులను హైలెట్ చేసుకోవడం, వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచవచ్చనే విధంగా, అదే సమయంలో పార్టీ క్రెడిట్ పెరిగేలా చేసుకోవచ్చనే వ్యూహంతో జనసేన ఇప్పుడు దుకుడు గా ముందుకు వెళుతుంది.దీనిలో భాగంగానే ఏపీలో రహదారుల అంశాన్ని టార్గెట్ చేసుకుంది.

Telugu Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Ysrcp-Telugu Political News

ఏపీ వ్యాప్తంగా రహదారులు ధ్వంసం కావడం, ప్రజలు ఈ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడం ఇవన్నీ జనసేన సోషల్ మీడియా ద్వారా హైలెట్ చేస్తోంది.ఏపీ లో ఉన్న రహదారులపై పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా ధ్వంసమైన రోడ్ల ఫోటోలను సోషల్ మీడియా లో పెడుతూ ట్విట్టర్ లో JSP FOR AP ROADS అని హ్యాష్ టాగ్ తగిలించి మరీ వైరల్ చేస్తోంది.ఈ అంశం బాగా హైలెట్ అయితే క్షేత్రస్థాయిలో ఈ రహదారుల అంశంపై పోరాడేందుకు జనసేన ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది.

ఈ రహదారుల ఉద్యమం ద్వారా అయినా ‘ తమ రాజకీయ రహదారికి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube