తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుల ఎంపిక పూర్తయింది.ఈ మేరకు గురువారం ముఖ్యమం్రతి కె.
చంద్రశేఖరరావు పెద్దల సభకు మాజీ మం్రతి డి.శ్రీనివాస్‌తో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుని ప్రకటించారు.పిసిసి అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం, కేంద్ర అధికారులతో నేటికీ సత్సబంధాలు కొనసాగింపుతో పాటు తెరాసలో చేరితే రాజ్యసభ సభ్యత్వం ఇస్తామన్న కేసీఆర్ హామీ డి.శ్రీనివాస్‌కు కలసి వచ్చింది .తొలి నుంచి కెసిఆర్‌తో మెలుగుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో చేదోడుగా ఉన్నకెప్టెన్ లక్ష్మీకాంతరావు చోటు దక్కడం విశేషం
.






