సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే వాళ్లలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు.నిత్యం సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్స్ పెడుతూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటారు.
ఈ క్రమంలో తాజాగా ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసారు.గురువారం రోజున ఒక తొమ్మిది ఏళ్ల బాలుడు ప్రాచీన యుద్ధవిద్య అయిన కలరిపయట్టు విద్యను అభ్యసిస్తున్న వీడియోను సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసారు.
అయితే ఈ కాలంలో చాలామందికి క్రికెట్, హాకీ, ఫుట్ బాల్ తదితర వాటి గురించి తెలుసు కాని కలరిపయట్టు గురించి తెలియదు.ఇది ఒక ప్రస్తుత ఆధునిక కేరళలో గల ఒక పురాతన విద్య అంట.కళరిపయట్టునే అక్కడి ప్రజలు కలరి అని కూడా పిలుస్తారు.కర్రలు, కత్తులు, కవచాలను ఉపయోగించి ఈ విద్యను ప్రదర్శిస్తారు.
ఈ క్రమంలో వీడియోలో కనిపించే పదేళ్ల బాలిక చేతితో కర్రను పట్టుకొని చేతితో ఎంతో సులువుగా అటు ఇటు తిప్పుతూ కలరిపయట్టు సాధన చేస్తుండడం మనం గమనించవచ్చు.అయితే వీడియోలో కనిపించే చిన్నారి నిజంగా మీరు అనుకుంటున్నట్లు బాలిక కాదు.
బాలుడే.మీరు కూడా ఒక్కసారిగా ఆ వీడియోలో కనిపించేది అమ్మాయి అనే అనుకున్నారు కదా కానీ కాదు అందులో కలరిపయట్టు విద్యను అభ్యసించేసి ఒక బాలుడు.
వీడియోలో కనిపించే బాబు పేరు నీలకందన్ నాయర్.కేరళలోని ఏక వీర కలరిపయట్టు అకాడమిలో చదువుతున్నాడు.
అయితే ఈ పోస్టులో ఆనంద్ మహీంద్రా ఓ చిన్న తప్పిదం చేశారు.మనతో పాటు ఆనంద్ మహీంద్రా కూడా బాలిక అనుకుని పొరపాటు పడి పోస్ట్ చేసారు.
వీడియోతో పాటు మీ అందరికి ఒక హెచ్చరిక ఈ అమ్మాయిదారిలోకి ఎవరు రాకండి అంటూ క్రీడా రంగంలో కలరిపయట్టుకు ప్రాముఖ్యత ఇవ్వాలని అప్పుడే అందరి ద్రుష్టి కలరిపయట్టుపై ఉంటుందని పోస్ట్ చేసారు.
ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది.ఎంతో మంది ఈ వీడియోకి కామెంట్స్ కూడా పెట్టారు.నిజం చెప్పాలంటే ఈ వీడియో చూసి వీడియోలోని కలరిపయట్టు నేర్చుకుంటున్న నీలకందన్ నాయర్ కూడా స్పందించాడు.
నాకు సపోర్ట్ గా ఉన్న మీకు నా ధన్యవాదాలు సార్ అంటూ రిప్లై ఇచ్చాడు.అలాగే మీరు చేసిన మెసేజ్ లో ఒక చిన్న పొరపాటు ఉందని, నేను అమ్మాయిని కాదు, పది సంవత్సరాల అబ్బాయిని అని రిప్లై ఇచ్చాడు.
అలాగే నీలకందన్ కలరిపయట్టు విద్యలో ఒక షార్ట్ మూవీలో నటించడానికి ఇలా నా జుట్టును పొడవుగా పెంచుకుంటున్నానని మెసేజ్ చేసాడు.అమ్మాయి అయిన, అబ్బాయి అయినా వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.