ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చదువు పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు.సరికొత్త మార్పులతో ప్రభుత్వ పాఠశాలల విధివిధానాలను మార్చేశారు.
కార్పొరేషన్ స్కూల్స్ మాదిరిగా విద్యా విధానాన్ని అమలులోకి తెచ్చారు.ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని అమ్మఒడి వంటి పథకాన్ని ప్రవేశ పెట్టారు.
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను విద్యను కూడా ప్రవేశ పెట్టారు.అంతేకాకుండా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఉండాలని జగనన్న విద్యాకానుక అనే పథకంను ప్రవేశ పెట్టారు.
ఈ పధకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు చదువుకోవడానికి వారికి కావలిసిన 7 రకాల వస్తువులు కలిగిన కిట్ ను ప్రతి విద్యార్థికి అందించారు.
గత ప్రభుత్వం హయంలో విద్యార్థుల సంఖ్య కేవలం 37 లక్షలుగా ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య పెరిగి 43 లక్షలకు చేరువ అయింది. ఈ క్రమంలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యాకానుక పథకం ద్వారా రూ.731.30 కోట్లు వ్యయం ఖర్చు అవుతుందని భావించారు.కానీ ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య పెరగడంతో మరో రూ.57.92 కోట్లు కేటాయించారు.అంటే ఈ విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక కిట్లకోసం ఏకంగా రూ.789.22 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది అన్నమాట.
ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అయిన విషయం తెలిసిందే.ఆ మొదటి రోజునే సీఎం వైఎస్ రెండో విడత జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని ప్రారంభించారు.జగనన్న విద్యాకానుకలో విద్యార్థులకు ఇచ్చే వస్తువులు ఒకసారి చూస్తే 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు.
అయితే ఈ విద్యాసంవత్సరంలో అదనంగా ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కూడా అందచేయడం విశేషం అనే చెప్పాలి.ఏది ఏమయినా సీఎం జగన్ విద్యార్థుల చదువుల కోసం ఇంత డబ్బు ఖర్చు చేయడం అంటే మాములు విషయం కాదు కదా.