అనంతపురం జిల్లాలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి.మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మధ్య కోల్డ్ వార్ ఎప్పటినుండో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇది మరింతగా ముదిరింది.చాలా సందర్భాలలో శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి.
తన నియోజకవర్గం కాకపోయినా అనుమతి లేకుండా వస్తూ ఉండటంతో రఘునాథ రెడ్డి ఏప్పటినుండో అసహనం.ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే శుక్రవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ నీ కలవటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి.వస్తున్నట్లు సమాచారం పల్లె రఘునాథరెడ్డి అనుచరులకు తెలియడంతో.దారి మధ్యలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమయ్యారు.దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితులకి వాతావరణం వస్తూ ఉండటంతో సమాచారం అందుకున్న పోలీసులు పుట్టపర్తిలో జేసీని అదుపులోకి తీసుకుని పట్టణం కి తరలించారు.
పోలీసులు సరైన సమయంలో ఎంట్రీ ఇవ్వటంతో ఏటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోలేదు.







