రెండు పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ! వెనకబడ్డ ఆ పార్టీ ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు .

 A Fierce Fight Between The Two Parties! The Party Behind, Telangana Elections, B-TeluguStop.com

ఎక్కడికి అక్కడ  రోడ్డు షోలు , భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూనే గడపగడపకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయా పార్టీల అభ్యర్థులు నిమగ్నం అయ్యారు.  క్షణం తీరిక లేదు అన్నట్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో అధికార పార్టీ బీఆర్ఎస్ ఉండగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ( Karnataka assembly elections )గెలిచిన ఆనందంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలోనూ అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.ఇక కేంద్ర అధికార పార్టీ బిజెపి ఈ ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది.

ఆ పార్టీ అగ్ర నేతలైన ప్రధాని మోదీ , అమిత్ షా వంటి వారు తరచుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.

Telugu Amith Sha, Congress, Kishan Reddy, Modhi, Revanth Reddy, Telangana-Politi

ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు .ఎన్ని చేసినా ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్,  బిఆర్ఎస్( Congress, BRS ) మధ్య అన్నట్లుగా ఉంది.చాలా నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులు బలహీనంగా ఉండడం,  పార్టీకి తగినంత స్థాయిలో బలం లేకపోవడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.

జనసేన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా,  ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారానికి రాకపోవడం,  అంతేకాకుండా జనసేన అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అంత ఆసక్తి చూపించకపోవడం , బి ఆర్ ఎస్ , కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తూ బిజెపి అభ్యర్థులను గెలిపించాలనే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించకపోవడం ఇవన్నీ బిజెపికి ఇబ్బందికరంగానే మారాయి.చాలా నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులు కొత్తవారు కావడం, కొన్ని ప్రాంతాల్లో బిజెపికి పట్టు లేకపోవడం క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు లేకపోవడం ఇవన్నీ ఇబ్బందికరంగానే మారాయి .

Telugu Amith Sha, Congress, Kishan Reddy, Modhi, Revanth Reddy, Telangana-Politi

ఇక బీఆర్ఎస్,  కాంగ్రెస్ పార్టీలు ప్రధాన పోటీ అంతా తమ రెండు పార్టీల మధ్యనే అని ఫిక్స్ అయిపోయాయి.  అందుకే ఒకరిని టార్గెట్ చేసుకుంటూ మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.  బిజెపిని పరిగణలోకి తీసుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.మొదట్లో బిజెపి బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి కనిపించింది .తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో బిజెపి ప్రభావం ఎక్కువగా కనిపించేది.ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత తెలంగాణలో బిజెపి స్లో అయినట్టుగానే ఉంది.

  దీనికి తోడు ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం , వాటిని కంట్రోల్ చేసే విషయంలో అధిష్టానం శ్రద్ధ తీసుకోకపోవడం వంటివన్నీ ఇప్పుడు బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube