టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి కమర్షియల్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే.అయితే ఏబీఎన్ రాధాకృష్ణ వల్లే ఈ కాంబో సాధ్యమైందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఆర్ఆర్ఆర్ మూవీతో ఏబీఎన్ రాధాకృష్ణకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు.అయితే కొన్నేళ్ల క్రితం రాధాకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ కు జక్కన్న హాజరయ్యారు.
ఆ సమయంలో రాధాకృష్ణ రాజమౌళితో మల్టీస్టారర్ సినిమాల గురించి చర్చించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించొచ్చు కదా అని సూచించగా అదే కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ తెరకెక్కి సంచలన విజయాన్ని అందుకుంది.
మెగా, నందమూరి హీరోల కాంబినేషన్ లో జక్కన్న సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీకి ఒక విధంగా జక్కన్న బీజం వేశారని ప్రచారం జరుగుతోంది.
ఆ సమయంలో అభిమానుల నుంచి సమస్య అని చెప్పిన రాజమౌళి ఎట్టకేలకు తారక్, చరణ్ లతో సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించారు.ప్రస్తుతం ఉన్న ఫ్యాన్స్ లో పిచ్చతనం, మూర్ఖత్వం పెరిగిపోయిందని జక్కన్న చెప్పుకొచ్చారు.
జక్కన్న తర్వాత సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించనున్నారు.చరణ్ రామరాజు పాత్రకు తారక్ భీమ్ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు.

రాజమౌళి తన బ్రాండ్ నేమ్ తో సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు.రాజమౌళికి ఉన్న క్రేజ్ వల్లే ఆర్ఆర్ఆర్ మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.ఈ సినిమా అంచనాలను మించి థియేట్రికల్ కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.ఆర్ఆర్ఆర్ మూవీ రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది.







