లక్ అంటే ఇదే.. పీకల్లోతు అప్పుల్లో మునిగిన వ్యక్తికి రూ.70 లక్షల లాటరీ..

అదృష్టం ఉంటే ఒక్కోసారి చివరి క్షణాల్లోనైనా కష్టాల్లో నుంచి బయట పడవచ్చు.తాజాగా కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన పోఖున్జు అనే 40 ఏళ్ల మత్స్యకారుడికి ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడే అదృష్టమే వరించింది.ఈ మధ్యతరగతి వ్యక్తి ఆర్థిక సమస్యలు తాళలేక కొన్నేళ్ల క్రితం ఇంటి పత్రాలను బ్యాంకులో పెట్టి రూ.9 లక్షల లోన్ తీసుకున్నాడు.ఇప్పటి వరకు ఆ అమౌంట్‌ను తిరిగి చెల్లించలేదు.ఇప్పుడు అతను దానికైనా వడ్డీతో సహా రూ.12 లక్షలు చెల్లించాల్సి ఉంది.అయితే ఈ అప్పు తీర్చడంలో అతడు విఫలమయ్యాడు.

 This Is What Luck Is.. A Person Who Is Drowning In Debt Gets A Lottery Of Rs. 70-TeluguStop.com

దీంతో కొన్ని గంటలలోగా అప్పు తిరిగి చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బ్యాంకు సిబ్బంది నోటీసులు పంపించింది.

ఈ నోటీసు చదివిన వెంటనే ఏం చేయాలో తెలియక పోఖున్జు తల పట్టుకున్నాడు.

ఇంటిని బ్యాంకు సిబ్బంది స్వాధీనం చేసుకుంటే తన భార్యా పిల్లలను ఎక్కడ ఉంచాలి? బతుకు బజారవుతుందా? అనే ఆలోచనలతో అతను మానసికంగా ఎంతో కృంగిపోయాడు.తనకి ఎవరూ ఇప్పటికిప్పుడు అప్పు ఇచ్చే వారు లేరు అనుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు.ఈ సమయంలోనే ఒక మిత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి.‘పోఖున్జు, నీకు లాటరీలో రూ.70 లక్షలు తగిలాయి’ అని శుభవార్త అతని చెవిలో పడేశాడు.ఈ గుడ్ న్యూస్ వినగానే అప్పటివరకు చెప్పలేనంత బాధలో ఉన్న అతడు వెంటనే ఆనందంతో చిన్న పిల్లాడి లాగా గంతులు వేశాడు.

Telugu Akshaya Lottery, Bank, Fisherman, Kerala, Rs Lottery-Latest News - Telugu

లాటరీ తగిలిన సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడుతూ తనకు అసలు లాటరీ టికెట్ కొనుగోలు చేయడం ఇష్టం లేదని.కానీ తన బంధువులలో ఒకరు ఎప్పుడూ లాటరీ కొనుగోలు చేస్తారని.తాను కూడా ఏదో సరదాగా ఒక టికెట్ కొనుగోలు చేశానని చెప్పాడు.రాష్ట్ర ప్రభుత్వ అక్షయ లాటరీ టికెట్ అక్టోబర్ 12న కొనుగోలు చేశాం అని పేర్కొన్నాడు.

ఈ లాటరీని గెలుస్తానని ఎప్పుడూ ఊహించలేదని కానీ దేవుడి దయవల్ల తనకు అదృష్టం వరించిందని చెబుతూ అతను ఆనంద భాష్పాలు కార్చాడు.లాటరీ డబ్బుతో తన అప్పులన్నీ తీర్చేసి కష్టాల నుంచి బయట పడతానని అతను చెబుతున్నాడు.

ఒక చిన్న షాప్ కూడా పెట్టుకుంటానని పేర్కొన్నాడు.ఈ విషయం తెలుసుకున్న అందరూ అదృష్టవంతుడు అంటే ఇతడే అని మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube