తెలంగాణ ( Telangana) లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ పార్టీ అంతా ఖాళీ అవుతోంది.పార్టీని నమ్ముకొని ఉన్న నేతలు భవిష్యత్తు లేదని భావించారో ఏమో ఒక్కొక్కరిగా పార్టీని విడిచి బయటకు వెళ్ళిపోతున్నారు.
ఆ బాటలోకి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ( Konda Vishweshwar Reddy )కూడా వస్తున్నట్టు తెలుస్తోంది.మరి ఆ వివరాలు ఏంటో చూసేద్దాం.
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంతకాలం ఒక ఊపు ఊపింది.బి ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విధంగా తయారయింది.
ఎప్పుడైతే అధిష్టానం బండి సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందో అప్పటినుంచి కార్యకర్తల స్థాయి నుంచి బడా లీడర్ల వరకు నైరాష్యంలో పడ్డారు.బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని భావించారు.
ఇదే క్రమంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.అధికార బీఆర్ఎస్ ఇప్పటికే టికెట్లు ఖరారు చేసింది.కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ అన్ని టికెట్లు ప్రకటించింది.ఈ సందర్భంలోనే బీజేపీ (BJP) పార్టీలో ఉండేటువంటి బడా లీడర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి బీజేపీ ని వీడి కాంగ్రెస్లో చేరారు.ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ కూడా ఓకే చేయించుకున్నారు.
ఇక వివేక్ వెంకటస్వామి టికెట్ల విషయం పక్కనబెట్టి బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని మీడియా ముఖంగా చెప్పారు.ఇదే తరుణంలో బీజేపీ మొదటి మొదటి లిస్టులో 53 మంది ఎమ్మెల్యేలను ప్రకటించింది.
తాజాగా మూడవ లిస్ట్ కూడా రిలీజ్ చేసి 35 మంది ఎమ్మెల్యేలను ప్రకటించింది.ఇదే తరుణంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి అధిష్టానం పై గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
ఎందుకంటే బిజెపి అధిష్టానం జనసేన ( Janasena ) తో పొత్తులో భాగంగా భాజపా 9 నుంచి 11 స్థానాలు కోల్పోయే అవకాశం ఉంది.దీంతో ఉమ్మడి రంగారెడ్డి ( Rangareddy ) జిల్లాలకు కూకట్ పల్లి,శేర్లింగంపల్లి, ఎల్బీనగర్ చోట్ల భాజాపా ఆశావాహుల నుంచి తీవ్రమైన ఒత్తిడి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై పడుతుందట.
కాబట్టి ఆయన ఈ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వొద్దని తాను చెప్పిన వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని బిజెపి అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది.కానీ అధిష్టానం ఆయన మాటలు పట్టించుకోకపోవడంతో కొండపై ఒత్తిడి పెరిగిందట.
దీంతో వివేక్ వెంకటస్వామి లాగే కాంగ్రెస్ ( Congress) పార్టీలోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.ఒకవేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే చేవెళ్ల లోక సభ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో నుండి ఐదు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా విశ్వేశ్వర్ రెడ్డి ని ఎలాగైనా కాంగ్రెస్ లోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఒకటి రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.