రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ గురువారం స్థానిక బైపాస్ రోడ్డు లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తను బిజెపి పార్టీలో చేరినప్పుడు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సిరిసిల్ల నియోజకవర్గం లోని ఎల్లారెడ్డిపేట మండల బిజెపి నాయకులను లేనిపోని కేసుల్లో ఇరికించి, కొట్టిపించి నానా ఇబ్బందులకు గురి చేశారని అయినా కానీ బెదిరింపులకు భయపడని ఏకైక కార్యకర్త బిజెపి కార్యకర్తనేనని అన్నారు.
ఇప్పటికీ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో చేసినటువంటి అరాచకాలకు చెల్లుచీటీ అని అన్నారు.
తమ బిజెపి కార్యకర్తలను అదిరిపించి బెదిరిపించి డబ్బులతో లొంగదీసుకునే ప్రయత్నం చేసిన ఎలాంటి వాటికి లొంగకుండా పార్టీ సిద్ధాంతం కొరకు పనిచేస్తారని ఆమె అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు ఏబీవీపీ నాయకుల పోరాటం ఎనలేనిదని,ఏబీవీపీ నాయకుల పోరాట ఫలితంగానే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కావడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ మండలంలో ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వ జాబ్ కూడా ఇవ్వలేదని అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి సాంఘిక పాఠశాలలో త్రాగునీళ్లు లేక విద్యార్థులు ధర్నా చేసిన రోజులు ఉన్నాయని గుర్తు చేశారు.
వర్షాకాలంలో ఎల్లారెడ్డిపేట మండలానికి వచ్చే రోడ్లు బురదమయంగా మారుతున్నాయని, రోడ్లు వేపిస్తున్నామని రాష్ట్ర బడ్జెట్ లో కేటాయిస్తూ ఏమి చేస్తున్నారని ఆ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయని ఒక్కసారి ఎల్లారెడ్డిపేట ప్రజలు అడగాల్సిన ప్రశ్నఅని అన్నారు.
రాష్ట్ర బడ్జెట్ నుండి వందల కోట్ల డబ్బులు పట్టుకొస్తున్నారు, ఆ డబ్బులు ఎటు వెళ్తున్నాయంటే సిరిసిల్ల, సిద్దిపేట,గజ్వేల్ కు పోతున్నాయని.ఆ డబ్బులు కేటీఆర్ బంధువులు, బినామీలు కాంట్రాక్టుల లెక్క చెప్పి పది రూపాయలకు వంద రూపాయలు లెక్క చూపిస్తూ రాష్ట్ర బడ్జెట్ ను కొల్లగొడుతున్నారన్నారు.
కేటీఆర్ కు సంబంధించిన గుప్పెడు మంది చేతుల్లో సిరిసిల్ల ప్రజలకు రావాల్సిన డబ్బు, అభివృద్ధికి రావలసిన డబ్బులు కేవలం వారి చేతుల్లో కేంద్రీకృతమై ఇప్పుడు ప్రజలకు మొండి చేయి చూపించాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు ఒక్కసారి ఆలోచించి ప్రజల బిడ్డగా ప్రజా సమస్యలు తెలుసని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి తనను గెలిపించాలని మండల ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ఒకసారి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలంగాణలో అవకాశం ఇవ్వండి అని ఈ సందర్భంగా ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఇన్చార్జ్ గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు దేవేందర్ రెడ్డి,లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి, మోర్చాల అధ్యక్షులు, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.