సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన వారిలో బిగ్ బాస్ బ్యూటి గీతూ రాయల్ ఒకరు.
ఈమె బిగ్ బాస్ రివ్యూయర్, పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఫేమస్ అయ్యారు.ముఖ్యంగా ఈమె చిత్తూరు భాషలో మాట్లాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి.
ఈ పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈమె టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరూ భావించినప్పటికీ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు.
ఇలా ఈమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత పెద్దగా ఎక్కడ కనిపించలేదు అయితే తాజాగా చిత్తూరులో గీతూ సందడి చేశారు.చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గీతూకి పెద్ద ఎత్తున నిర్వాహకులు సన్మానం చేశారు.అనంతరం ఈ కార్యక్రమంలో ఈమె మాట్లాడుతూ…మీ అభిమానం చూస్తుంటే నా వల్ల కావడంలేదు రా నాయనా అంటూ చిత్తూరు ప్రజలపై తన అభిమానాన్ని చూపించారు.

తాను చిత్తూరు వదిలి వెళ్లి 15 సంవత్సరాల అవుతున్నా చిత్తూరు నా బ్లడ్ లో చిత్తూరు యాసను ఎక్కించుకున్నాను.నేను ఎక్కడికి వెళ్లినా ఏ సందర్భంలో అయినా ఇదే భాషలోనే మాట్లాడతానని నీది ఏ ఊరు అంటే చిత్తూరు అని చాలా గర్వంగా చెప్పుకుంటానని గీతు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.ఇక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన తర్వాత తాను రెండు విషయాలు నేర్చుకున్నానని…మనం తప్పు చేయనప్పుడు మన ముందు ఎవరున్నా అసలు తగ్గదని అలాగే మనం తప్పు చేసి ఉంటే మనకన్నా చిన్నవాళ్ళకైనా క్షమాపణలు చెప్పాలి అనే విషయాలను తాను నేర్చుకున్నాను అంటూ ఈ సందర్భంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా ఈ సందర్భంగా ఈమె మాట్లాడారు.







