తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే.డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ ఒకవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు.
ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుకుమార్ తాజాగా పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.పవన్ కళ్యాణ్ గారికి కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినీ సెలెబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున తనని అభిమానిస్తూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.
ఇలా అభిమానించే వారిలో సుకుమార్ కూడా ఒకరు.ఇక ఈయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి మాట్లాడాలని ఎంతో తపన పడ్డారట.అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం రాలేదని సుకుమార్ తెలిపారు.అయితే ఒకరోజు మాత్రం సుకుమార్ త్రివిక్రమ్ సినిమా షూటింగులు రెండు పక్కపక్కనే జరగడంతో సుకుమార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ షూటింగ్ జరిగే లొకేషన్ కి వెళ్ళారట.
అయితే పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల తనని కదిలించలేక కాసేపు త్రివిక్రమ్ తో మాట్లాడే అక్కడి నుంచి వెళ్లిపోయారట.

ఇక పవన్ కళ్యాణ్ తన పనిలో బిజీగా ఉన్నప్పటికీ సుకుమార్ వచ్చిన విషయాన్ని గమనించారట ఇక సుకుమార్ వెళ్లిపోవడంతో త్రివిక్రమ్ దగ్గరికి వెళ్లిడైరెక్టర్ సుకుమార్ వచ్చారు తనని చూస్తుంటే చాలా ఆయాస పడుతున్నట్టు అనిపించింది నేనే వచ్చి మాట్లాడదాం అనుకున్నా కానీ అంతలోపే వెళ్లిపోయారని పవన్ త్రివిక్రమ్ తో చెప్పారట.ఎందుకైనా మంచిది తన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి అంటూ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి చెప్పారట ఇలా తనతో మాట్లాడకపోయినా ఆయన మాత్రం నా ఆరోగ్యం గురించి ఆలోచించి నాకు జాగ్రత్తలు చెప్పడంతో పవన్ మంచి తనానికి తాను ఫిదా అయ్యానని సుకుమార్ ఓ సందర్భంలో ఈ విషయం గురించి తెలియజేశారు.







