తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.ఇక ఈ కార్యక్రమం 12 వారాలు పూర్తి చేసుకోగా 12 వ వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి మోడల్ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.
ఇకపోతే మొదటినుంచి ఈ సీజన్లో ఇతర కంటెస్టెంట్లతో పెద్ద ఎత్తున పోటీ పడుతూ టాప్ కంటెస్టెంట్ గా రేవంత్ నిలుస్తున్నారు.ఈయన మాట కొంచెం దురుసుగా ఉన్నప్పటికీ ఇతర టాస్కులలో బాగా పోటీపడుతూ ప్రతిసారి టాప్ పొజిషన్ లోనే నిలుస్తున్నారు.
ఇకపోతే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే విషయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే ఈసారి సీజన్ సిక్స్ కప్పు గెలిచేది మాత్రం రేవంత్ అంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే తాజాగా బిగ్ బాస్ వేదికపైకి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఆహ్వానించి కంటెస్టెంట్లలో మరింత జోష్ నింపారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ వేదిక పైకి వచ్చినటువంటి మాజీ బిగ్ బాస్ విన్నర్ శివబాలాజీ, ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్ బిగ్ బాస్ విన్నర్ ఎవరో పరీక్షంగా చెప్పేశారు.

ఇక వీరిద్దరూ కూడా బిగ్ బాస్ వేదికపై మాట్లాడుతూ.రేవంత్ ను గెలిస్తే,తనను కొట్టేస్తే బిగ్ బాస్ విన్నర్ అయినట్లే అంటూ వేదికపై మాట్లాడారు.ఇలా వీరు రేవంత్ ను గెలిస్తే బిగ్ బాస్ విన్నర్ అయినట్టే అని మాట్లాడటంతో ఆల్రెడీ బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అని ఈ ఇద్దరు పరోక్షంగా బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అని చెప్పకనే చెప్పేశారు.ఇలా రేవంత్ తో పాటు శ్రీహన్ ఆదిరెడ్డి కూడా పెద్ద ఎత్తున ట్రోఫీ కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.