టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
లక్ష్మీ ప్రణతి చాలా తక్కువగా బయట కనిపిస్తూ ఉంటారు.
ఈమె అందరి మాదిరి సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండరు.
ఏదైనా వెకేషన్ల సమయంలో మాత్రమే లక్ష్మీ ప్రణతి ఫోటోలు సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటాయి.అంతకు మించి ఈమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు.
ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ పూర్తిగా కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్న లక్ష్మీ ప్రణతి గురించి తాజాగా ఓ విషయం బయటపడింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.అయితే లక్ష్మి ప్రణతికి మాత్రం తన భర్త ఎన్టీఆర్ కన్నా మరొక హీరో అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాగశౌర్యకు అభిమాని అని తెలుస్తుంది.
నాగశౌర్య తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ నటన పరంగా హీరోగా కూడా తనకు ఇష్టమైన నటుడనీ తెలుస్తుంది ఇక ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఒకింత షాక్ కి గురయ్యారు.







