ఇప్పుడు అంతో ఇంతో పేరు తెచ్చుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు బాగానే ప్రయత్నిస్తున్నారు.ఎటూ కేంద్రంలో తమ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి.
తమకు తిరుగుండదని భావిస్తున్నారు.అయితే ఏపీలో ఆ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే.
ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు.కనీసం లోకల్ బాడీ ఎలక్షన్లలో జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా రాలేదు.
అయినా కూడా అధిష్టానం అండ చూసుకుని సోము వీర్రాజు పార్టీలో మొత్తం తానొక్కడినే కనిపించాలని అనుకుంటున్నారు.ఇంకొన్ని సార్లు ఏవేవో కామెంట్స్ చేసి ఫేమస్ కావాలని భావిస్తున్నారు.
అయితే మీడియా ముందు ఆయన చేసే కొన్ని అభ్యంతరకర కామెంట్లు ఆయనకు ఇబ్బందులు తెస్తున్నాయి.సొంత పార్టీలోనే ఆయన మీద వ్యతిరేకత తీసుకొచ్చేలా చేస్తున్నాయి.మొన్న కూడా ఇలాగే అనవసర కామెంట్లు చేశారు.కడపోల్లకు చంపడమే వచ్చు అంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు.
దీంతో రాయలసీమ ప్రజలకు ఆయన మీద వ్యతిరేక భావన ఏర్పడేలా చేస్తున్నాయి.ఇటీవల పార్టీలో చేరిన వారిలో అత్యధికులు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే.
దీంతో వారంతా సోము మీద అసహనంతో ఉన్నారంట.
ఇలాంటి వివాదాస్పద కామెంట్లతో చాలామది ఆయన మీద కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది.చాలా ఫిర్యాదులు ఎక్కువయ్యే సరికి కేంద్రం కూడా ఆయన మీద అలెర్ట్ గా ఉంటోంది.అందుకే ఆయన్ను ఇక మీదట మీడియా ముందుకు పంపిచకూడదని భావిస్తోందంట.
త్వరలోనే కొత్త ప్రెసిడెంట్‌ను కూడా నియమించేందుకు రెడీ అవుతోంది.బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన సోము.
పార్టీని పరుగులు పెట్టిస్తారనుకుంటే.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది బీజేపీలో.
మరి నిజంగానే కేంద్ర పెద్దలు కొత్త బాస్‌ను తీసుకొస్తారా లేదంటే సోముకు మరిన్ని రూల్స్ పెడుతారా అన్నది మాత్రం వేచి చూడాలి.