శీతాకాలంలో చలి అధికంగా ఉండడం ద్వారా ఎన్నో రకాల శారీరక సమస్యలు వస్తూ ఉంటాయి.ఇలాంటి సమయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా వెంటనే ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది.
ఇక అతి ముఖ్యంగా గర్భిణీల ఆరోగ్యం కూడా చలికి పాడవుతుంది.ఇక రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల శరీరం బలహీనపడుతుంది.
అలాంటి పరిస్థితుల్లో మహిళలు అంటువ్యాధులకు గురవుతారు.
అలాగే జీర్ణవ్యవస్థత, రోగనిరోధక శక్తి బలహీనంగా అయిపోతుంది అయితే అలాంటి వాతావరణంలో మహిళలు తమ ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహించాలి.
అయితే గర్భధారణ సమయంలో చలికాలంలో గర్భిణీలు అలవాట్లకు దూరంగా ఉండాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో శరీరం చలికి తట్టుకోలేక శరీరాన్ని వెచ్చగా ఉండేందుకు చాలామంది రోజు టీ తాగుతూ ఉంటారు.
ఇక చలికాలంలో ఎక్కువగా తాగుతూ ఉంటారు.గర్భవతి అయితే ఈ అలవాటు కచ్చితంగా ఆరోగ్యానికి చాలా హానికరం అని చెప్పాలి.
మిల్క్ టీ, బ్లాక్ టీ లేదా ఇతర టీలలో దాదాపుగా 30 నుండి 40 mg కెఫీన్ ఉంటుంది.అయితే వైద్య నిపుణులు మాత్రం గర్భధారణ సమయంలో కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదని చెబుతుంటారు.

అందుకే చలికాలంలో టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి.మలబద్ధకం, కడుపునొప్పి, గ్యాస్ లాంటి లక్షణాలు గర్భంలో కనిపిస్తాయి.అయితే టీ తాగాలని అనిపిస్తే గర్భిణీలు హెర్బల్ టీ తాగవచ్చు.ఇక అదే విధంగా చలికి తట్టుకోలేక వెచ్చగా ఉండేందుకు చాలా మంది గర్భిణీలు మందపాటి బట్టలు వేసుకుంటారు.
అయితే గర్భధారణ సమయంలో వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

శరీరానికి ఫిట్గా ఉండే బట్టలు వేసుకుంటే శరీర రక్తప్రసరణ దెబ్బతింటుంది.ఇలా చేస్తే గర్భధారణ సమయంలో వాపు సమస్య వస్తుంది.అలాగే బీపీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
అందుకే చలి రోజుల్లో వెచ్చగా ఉండాలంటే వేడి ఆహారాన్ని తీసుకోవాలి అంతే తప్ప మందపాటి దుస్తులు ధరించకూడదు.అదేవిధంగా చలికాలంలో గర్భిణీలు వేయించిన ఆహారాన్ని తీసుకోకూడదు.
అలాగే డిహైడ్రేషన్ నుండి శరీరాన్ని రక్షించుకోవాలి.అందుకే ఎప్పటికప్పుడు నీరు త్రాగుతూ ఉండాలి.అలాగే ఫైబర్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.అలాగే వండిన వేడి ఆహారాన్ని తినాలి.
శరీరాన్ని అలాగే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.అలాగే తగినంత నిద్ర పొందాలి.