బ్రెస్ట్ క్యాన్సర్(రొమ్ము క్యాన్సర్) అంటే స్త్రీ, పురుషులిద్దరిలోనూ వ్యాపిస్తుంది.కాకపోతే ఇది మహిళల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్‌గా మారింది.
ఇటీవల రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణం లేదు.
కానీ, దీని ప్రమాదాన్ని పెంచడంలో మాత్రం ఎన్నో విషయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.అందులో ఆహారపు అలవాట్లు కూడా ఒకటి.
ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను అమాంతం పెంచుతుంటాయి.అటువంటి డేంజరస్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండీ.
పంచదార.తినడానికి తియ్యగా ఉన్నా ఇది విషంతో సమానం అని అంటుంటారు.పంచదార ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.దీన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం పెరిగిపోతుంది.
ఊబకాయం పెరిగితే వివిధ రకాల క్యాన్సర్లు సంభవిస్తాయి.అందులో ఒకటే బ్రెస్ట్ క్యాన్సర్.
కాబట్టి, పంచదార మరియు పంచదారతో తయారు చేసిన ఆహారాలను ఎవైడ్ చేయడం ఎంతో ఉత్తమం.
శరీరానికి కార్బో హైడ్రేట్స్ చాలా అవసరం.
కానీ, వాటిని అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే రిస్క్ పెరుగుతుందని ఇటీవల చేసిన పరిశోధనలు చెబుతున్నాయి.

బ్రెడ్, బీన్స్, పాలు, పాప్ కార్న్, బంగాళదుంపలు, కుకీలు, శీతల పానీయాలు, మొక్క జొన్న వంటి ఆహారాల్లో కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.అందువల్ల, ఈ ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి.
అలాగే ప్రాసెస్ చేసిన మాంసాలు, నూనెలో వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ వంటివి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.
కాబట్టి, లేడీస్ ఈ ఫుడ్స్‌తో కేర్‌ఫుల్ గా ఉండాల్సిందే.ఇక బ్రెస్ట్ క్యాన్సర్‌కు దూరంగా ఉండాలనుకుంటే మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను వదులుకోవాలి.బరువును అదుపులో ఉంచుకోవాలి.పోషకాహారం తీసుకోవాలి.
మరియు డైలీ వ్యాయామాలు చేయాలి.