ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గురువారం స్థానిక సాయి మణికంఠ ఫంక్షన్ హాలులో వర్కింగ్ జర్నలిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 Yellareddy Pet Press Club Unanimously Elects New Executive Committee, Yellareddy-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీ శంకర్ మాట్లాడుతూ.నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు కావడం సంతోషకరమని,అధ్యక్షునిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

జర్నలిస్టుల ఐక్యత కొరకు ప్రతి వర్కింగ్ జర్నలిస్టు కలిసికట్టుగా పనిచేయాలన్నారు, ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా స్థానిక నాయకులకు,అధికారులు సహకరించాలని కోరారు.జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేయాలని, ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలను నిర్భయంగా వార్తలను ప్రచురించాలని తెలిపారు,ఈ సమావేశంలో ఎల్లారెడ్డిపేట మండల జర్నలిస్టులు అందరు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా కాసు శ్రీనివాసరాజు,ఎదురు గట్ల ముత్తయ్య,ఉపాధ్యక్షులుగా ఒగ్గు బాలరాజు యాదవ్,కందుకూరి రవి,ప్రధాన కార్యదర్శిగా శ్యామంతుల అనిల్, కార్యదర్శులుగా రామోజీ శేఖర్, కట్టెల బాబు,సంయుక్త కార్యదర్శులుగా శ్రీ రామోజీ ప్రవీణ్,కులేర్ కిషోర్, కోశాధికారిగా మహమ్మద్ లతీఫ్, ముఖ్య సలహాదారుడిగా బండారి బాల్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube