సాధారణంగా కొందరి జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది.కానీ కొందరిది మాత్రం పల్చగా తోకల ఉంటుంది.
ఇటువంటి పల్చటి జుట్టును కలిగిన వారు ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు.అలాగే పల్చటి జుట్టు అందాన్ని మరింత తగ్గిస్తుంది.
అయితే జుట్టు పల్చగా మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, వేడి వేడి నీటితో తలస్నానం చేయడం, పోషకాల కొరత ఇలా అనేక కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి పల్చగా మారుతుంది.
మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా.? అయితే చింతే వద్దు.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని వారానికి ఒక్కసారి కనుక పాటిస్తే మీ జుట్టు వద్దన్నా ఒత్తుగా పెరుగుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏమిటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం, వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ), రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ మరియు గుప్పెడు మునగాకు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో జెల్లీ స్ట్రక్చర్ లో ఉన్న మిశ్రమాన్ని సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్ గోరువెచ్చగా అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.మీరు వద్దన్నా సరే మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.
అదే సమయంలో జుట్టు రాలడం( Hair loss ) తగ్గుతుంది.కురులు సిల్కీగా షైనీ గా మారతాయి.
మరియు ఈ రెమెడీని పాటిస్తే జుట్టు చిట్లడం విరగడం వంటివి సైతం తగ్గుముఖం పడతాయి.