తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్ కు ధైర్యం ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇవ్వాలని పొంగులేటి ఛాలెంజ్ చేశారు.
కేసీఆర్ సుమారు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు సిద్ధం అవుతున్నారని ఆయన ఆరోపించారు.ఈ క్రమంలో ఇంకా 55 రోజులు మాత్రమే కేసీఆర్ అధికారంలో ఉంటారన్న ఆయన తరువాత అధికారం కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజలను కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పీక్కుని తింటున్నారని విమర్శించారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలో తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని వెల్లడించారు.