పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ పర్యటనకు వెళ్లిన జగన్, తన చిన్న కుమార్తె వర్షా రెడ్డి( Varsha Reddy ) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కింగ్స్‌ కాలేజ్‌ లండన్( Kings College London ) నుంచి మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఫైనాన్స్‌) పట్టా పొందిన సందర్భంగా ఈ ప్రయాణం ప్రత్యేకమైంది.

 Ys Jagan Shares Joy As Daughter Graduates From Kings College London Details, Ys-TeluguStop.com

వర్షా రెడ్డి కేవలం పట్టా పొందడమే కాకుండా.డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించడం కుటుంబానికి గర్వకారణంగా మారింది.

ఈ సందర్భాన్ని గుర్తుంచుకునేలా జగన్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు జగన్.

ఈ ఫోటోతో పాటు ఆయన ఎమోషనల్ ట్వీట్ చేస్తూ.“అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌లో చదివి డిస్టింక్షన్‌తో పట్టభద్రురాలవడం మాకు గర్వకారణం.ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ వర్షా సాధించిన విజయాన్ని ప్రశంసించారు మాజీ సీఎం.

సాధారణంగా జగన్ కుమార్తెలు హర్ష రెడ్డి, వర్షా రెడ్డి సోషల్ మీడియా వేదికలకి దూరంగా ఉంటారు.

ఈ పర్యటనలో ఫోటోలను జగన్ షేర్ చేయడం అభిమానులను సంతోషానికి గురిచేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా, వైయస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు వర్షా రెడ్డికి అభినందనలు తెలుపుతున్నారు.ఈ ఆనంద విషయాన్ని జగన్ కుటుంబం పంచుకోవడంతో లండన్ పర్యటనను మరింత ప్రత్యేకంగా మార్చింది.

కింగ్‌ కాలేజ్‌ లండన్ నుంచి పట్టా పొందడం వర్షా రెడ్డి విద్యా నైపుణ్యాలను ప్రదర్శించడమే కాకుండా, యువతకు ప్రేరణగా నిలిచే సందర్భం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube