పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్-1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.
దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు.ఆస్కార్ విజేత ఎం.
ఎం.కీరవాణి సంగీతాన్ని అందించడంతో ఈ చిత్రం పాటల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన ‘మాట వినాలి’( Maata Vinaali Song ) లిరికల్ వీడియో సంగీతప్రియుల హృదయాలను గెలుచుకుంటోంది.
ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించడం ప్రత్యేక ఆకర్షణ.“వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి” అంటూ తెలంగాణ యాసలో సాగిన ఈ గీతం వినసొంపుగా, అర్థవంతంగా ఉంది.‘మాట వినాలి’ పాట సాహిత్యాన్ని ప్రముఖ గేయ రచయిత పెంచల్ దాస్ అందించగా.
ఈ పాట శ్రోతలకు జీవితంలో మంచి మాటలు వినడం, వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆలోచన కలిగించే సందేశాన్ని అందిస్తుంది.అద్భుతమైన పంక్తులు, శక్తివంతమైన జానపద బీట్లతో పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
పాట విజువల్స్ ఆత్మీయతను కలిగిస్తాయి.
అటవీ నేపథ్యంలో మంట చుట్టూ గుమిగూడిన వీరమల్లు అనుచరుల దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి.పవన్ కళ్యాణ్ చక్కని గాత్రంతో పాటను ఆలపించడమే కాకుండా, గ్రేస్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో అభిమానులను మెప్పించారు.పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యింది.
ఈ పాట పాన్ ఇండియా చిత్రంలో భాగంగా ఐదు భాషల్లో విడుదలైంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన, కీరవాణి సంగీతం, భారీ స్థాయిలో నిర్మాణ విలువలతో ‘హరి హర వీరమల్లు’( Hari Hara Veeramallu ) పాన్ ఇండియా ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని అందించనుంది.
‘మాట వినాలి’ పాట విడుదలతో చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి.