టీకా సెంట‌ర్‌లో ఓ వ్య‌క్తి ఏం చేశాడో తెలిస్తే..

ప్ర‌స్త‌తుం క‌రోనా ఎంత‌లా ప్ర‌భావం చూపుతుందో అంద‌రికీ తెలిసిందే.దీన్ని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం.

 If You Know What A Person Did At The Vaccination Center, Vyaccine, Viral Video,-TeluguStop.com

అయితే ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర జ‌రుగుతున్న వింత‌ల‌న్నీ కూడా విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.ఇందులో కొన్ని సీరియ‌స్ గా ఉంటే.

మ‌రి కొన్ని ఫ‌న్నీగా ఉంటున్నాయి.అయితే ఇప్పుడు కూడా సోష‌ల్ మీడియాలో ఇలాంటి ఫ‌న్నీ వీడియోనే టీకా సెంట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగింద‌ని వైర‌ల్ గా మారింది.

ఈ వీడియోలో వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చిన ఓ యువ‌కుడు దారుణంగా ఏడ్చేసాడు.

అక్క‌డ ఉన్న సిబ్బంది ఇంజెక్షన్ వేసేందుకు రెడీ కావ‌డంతో దాన్ని చూసిన ఆ యువ‌కుడు చిన్నపిల్లాడి మాదిరిగా ఏడుపు అందుకున్నాడు.

ఇక అంత పెద్ద యువ‌కుడు ఇంజెక్ష‌న్‌ను చూసి ఏడ్వ‌డంతో అది చూసిన వారంతా నవ్వడం వారి వంతైంది.ప్ర‌స్తుతం మ‌న దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ కొనసాగుతుండ‌టంతో చాలా ప్రాంతాల్లో టీకాలు వేసేందుకు సిబ్బంది వెళ్తున్నారు.

ఇక చాలా మందికి ఇంజక్షన్‌ ఫోబియా ఉండ‌టంతో వారు చేస్తున్న‌ రచ్చకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వీడియోలో టీకా సెంట‌ర్‌కు వ‌చ్చిన ఆ యువకుడు ఫ‌స్ట్ ఎంతో ధైర్యంగానే ఉన్న‌ట్టు క‌నిపించాడు.టీకా వేసుకునేందుకు రెడీ అన్న‌ట్టు క‌నిపించాడు.కానీ ఎప్ప్ఉడైతే మహిళా డాక్టర్ టీకాను చేతులో ప‌ట్టుకుందో ఇక అప్పటి నుండి ఒక్క సారిగా ఆ యువకుడి గట్టిగా అరుస్తూ ఏడ్చేస్తున్నాడని చెప్పొచ్చు.

ఇక ఆ మ‌హిళా డాక్టర్ అత‌డి ఏడ్చిన తీరు చూసి నిజంగానే షాక్ అయింది.డాక్ట‌ర్ తో పాటుగా ఆ సెంట‌ర్‌లో ఉన్న వారంతా కూడా న‌వ్వు ఆపుకోలేక‌పోయారు.

ఇక ఇప్పుడు ఈ వీడియో ఓ ట్రెండింగ్ మారిపోయింది.మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube