మానవ సంబంధాలు అంతకంతకు దిగజారుతున్నాయి.గతంలో మాదిరిగా అందరితో ఎంతో ప్రేమగా ఉండే మనుషుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది.
డబ్బు ఇప్పుడు అన్నింటికంటే కీలక పాత్ర పోషిస్తోంది.డబ్బు కోసం దేనికైనా తెగిస్తున్నారు కొంతమంది.
పాపిష్టి డబ్బు కోసం కన్న వారిని, కట్టుకున్న వారిని పొట్టన పెట్టుకుంటున్న ఎన్నో దారున ఘటనలను మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.అచ్చం అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
మద్యం మత్తులో కన్న తల్లిని హతమార్చిన ఓ దుర్మార్గుడు.తల్లి మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.చివరకు సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో.అసలు కథ బయటకు వచ్చింది.
నవ మాసాలు మోసి, కని, పెంచిన తల్లినే అతి దారుణంగా గొంతునులిమి చంపేసిన ఆ కసాయి.ఇప్పుడు కటకటాల వెంట ఊచలు లెక్కిస్తున్నాడు.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవ సంబంధాలు దిగజారిపోయాయనే దానికి మరో సాక్ష్యంగా నిలుస్తోంది.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్ పల్లి గ్రామానికి చెందిన గుడ్డల్ల భాస్కర్, మంజుల దంపతులకు ఇద్దరు కొడుకులు.
గంగా ప్రసాద్, అనిల్ అనే ఇద్దరు భాస్కర్, మంజులల కొడుకులు కాగా.

వీరిలో అనిల్ అనారోగ్యంతో కొన్నాళ్ల క్రితం మరణించాడు.సంవత్సరం క్రితం గుడ్డల్ల భాస్కర్ అనుకోని స్థితిలో చెరువులోపడి మరణించాడు.దీంతో మంజులకు భర్త మరణం తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి.
మద్యానికి బానిసగా మారిన గంగా ప్రసాద్. తల్లి మంజుల వద్ద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టాడు.డబ్బులు ఇచ్చేది లేదని తల్లి మొండికేయడంతో గంగా ప్రసాద్ మద్యం మత్తులో తన తల్లిని గొంతు నులిమి చంపేశాడు.ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న గంగా ప్రసాద్.
తన తల్లి మంజులది సహజ మరణంగా చూపించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు.కానీ సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తల్లిని గంగా ప్రసాద్ హతమార్చినట్లు తేలింది.







