విదేశాల్లో వెకేషన్ అనగానే వెంటనే గుర్తొచ్చేది థాయ్‌లాండ్.( Thailand ) మిగిలిన దేశస్థుల సంగతేమో కానీ భారతీయుల ఫేవరేట్ డెస్టినేషన్స్‌లో థాయ్‌లాండ్ ఒకటి.పర్యాటకుల స్వర్గధామంగా గుర్తింపు తెచ్చుకున్న థాయ్.ఏడాది పొడవునా టూరిస్టులతో కళకళలాడుతూ ఉంటుంది.రద్దీ ఉన్నా తప్పక చూడాల్సిన గమ్యస్థానం కాడంతో టూరిస్టులు ఇక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపుతారు.డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విస్తరించడంతో కంటెంట్ క్రియేటర్లు , ఇన్‌ఫ్లూయెర్స్ థాయ్‌లాండ్‌కు పరుగులు తీస్తున్నారు.
ఇలాంటి వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.‘‘ డిజిటల్ నోమాడ్ వీసా ’’ను ప్రవేశపెట్టింది.
డెస్టినేషన్ థాయ్‌లాండ్ వీసా (డీటీవీ)( Destination Thailand Visa ) అని పిలిచే ఈ కొత్త వీసా .ఫ్రీలాన్సర్‌లు, రిమోట్ వర్కర్లుకు గేమ్ ఛేంజర్ వంటిదని నిపుణులు అంటున్నారు.
గతంలో వీసా లేకుండా పర్యాటకులు 30 రోజుల వరకు ఉండేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.అయితే కొత్తగా తీసుకొచ్చిన డీటీవీ మరింత సౌకర్యవంతంగా బసను పొడిగిస్తుంది.అదనంగా 180 రోజుల వరకు థాయ్‌లాండ్‌లో ఉండేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు.అయితే ఈ డీటీవీని పొందేందుకు డిజిటల్ సంచార జాతులు( Digital Nomads ) తప్పనిసరిగా థాయ్‌లాండ్ వెలుపల ఉన్న క్లయింట్లు లేదా కంపెనీల కోసం పనిచేస్తూ ఉండాలి.డీటీవీ అనేది టీహెచ్‌బీ 10,000 (భారత కరెన్సీలో రూ.23,000) రుసుముతో చెల్లుబాటయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసా.
కాగా.థాయ్‌లాండ్ తన పర్యాటక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి , పర్యాటకులు( Tourists ) ఎక్కువ రోజులు ఇక్కడ గడిపేందుకు వీలు కలిగించేందుకు గాను 93 దేశాలకు వీసా గడువును పొడిగించారు.టూరిస్టుల బసను 60 రోజులకు పొడిగించడంతో పాటు వీసాలు పొందడాన్ని సులభతరం చేశారు.ఇప్పటికే భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించిన థాయ్‌లాండ్ ప్రభుత్వం .దీనిని ఈ ఏడాది నవంబర్ 11 వరకు పొడిగించింది.విద్యార్ధులు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత ఏడాది పాటు థాయ్‌లో ఉండొచ్చు.
అయితే పదవీ విరమణ చేసిన వారికి మాత్రం బీమా అవసరం.