యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఈసారి కూడా అంతే స్థాయిలో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఎన్టీఆర్ ఈ సినిమా విజయం తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
అయితే అనేక కారణాలతో ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.
అందులోను కొరటాల శివ మెగా హీరోలతో తీసిన ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడంతో ఇతడిపై ఒత్తిడి పెరిగింది.దీంతో స్క్రిప్ట్ విషయంలో పక్కాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నట్టు తెలుస్తుంది.
ఈ స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేసి మరీ పక్కాగా రెడీ అయినట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇన్ని రోజుల నుండి సెట్స్ మీదకు వెళ్ళక పోవడంతో కొరటాల తో చేసే సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి.
రోజు ఎక్కడో ఒక చోట ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి.అయితే ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది.
తాజాగా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.ఈ చిత్ర డైరెక్టర్ కొరటాల శివతో పాటు.ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఇంకా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటు భారీ స్థాయిలో పనులు చేస్తున్నారు అంటూ తెలుస్తుంది.ఇక ఈ నెలలోనే రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానున్నట్టు టాక్.

ఇంకా ఈ సినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు.అలాగే ఇతర నటీనటుల గురించి కూడా తెలియాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి ఉండాల్సిందే.ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.







