ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ పై టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సునీల్ సీఎం జగన్ కు సెక్యూరిటీ గార్డులా పని చేస్తున్నారని ఆరోపించారు.
ముందు అంబేద్కర్ నామస్మరణ, వెనుక జగన్ నామస్మరణ చేస్తున్నారని ఆమె విమర్శించారు.రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందని, ఎవ్వరినీ వదలిపెట్టమని హెచ్చరించారు.ఇది బెదిరించడం కాదని పేర్కొన్నారు.
రాజ్యాంగ పరంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.







