Director Puri Jagannadh: తనకు సహాయం చేయాలని ఇండస్ట్రీ పెద్దలను కోరిన పూరీ.. త్వరలోనే సమావేశం?

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.

 Industry Bigwigs To Discuss Puri Liger Issue Details, Vijay Deverakonda, Liger,-TeluguStop.com

ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో టీమ్ అంతా షాక్ అయ్యింది.ఈ స్పోర్ట్స్ డ్రామాకు ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి.

అందులోను హిందీలో కరణ్ జోహార్ ఇంవోల్వ్ అవ్వడంతో అక్కడ కూడా భారీ హైప్ క్రియేట్ చేశారు.

కానీ రిలీజ్ తర్వాత మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

ఇంతటి పరాజయాన్ని ఎవ్వరూ ఊహించలేదు.ఇటు టీమ్ కానీ.

అటు ప్రేక్షకులు కానీ ఈ ప్లాప్ ను ఉహించక పోవడంతో అందరికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.పూరీ తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో భారీ స్థాయిలో, భారీ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు.

లైగర్ డిజాస్టర్ తో నష్టపోయిన వారికీ సెటిల్ చేస్తానని పూరీ ఒప్పుకున్నాడు.

కానీ ఈ సినిమా సెటిల్మెంట్ వ్యవహారం ఇప్పుడు మరింత వివాదం అయ్యింది.రోజురోజుకూ మరింత జటిలంగా మారుతుంది.దీంతో పూరీ జగన్నాథ్ వార్తల్లో నిలుస్తున్నాడు.ఈ క్రమంలోనే ఇతడు డిస్టిబ్యూటర్స్ నుండి రక్షణ కోసం పోలీసుల వరకు వెళ్ళాడు.

Telugu Boycottpuri, Liger, Puri Jagannadh, Purijagannath-Movie

ఇక రాబోయే రోజుల్లో పూరీ జగన్నాథ్ తనకు సహాయం చేయాలని సినీ పెద్దలను కోరుతున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.ఇతడు పోలీసుల దగ్గర రక్షణ కోరుతూ డిస్టిబ్యూటర్స్ పై కేసు నమోదు చేసినప్పటి నుండి వీరు మరింత గుర్రుగా ఉన్నారు.

ఇతడిని ఇక నుండి బాయ్ కాట్ చేయడానికి నిర్ణయించుకున్నట్టు కూడా నెట్టింట వార్తలు వచ్చాయి.

దీంతో పూరీ ఎమోషనల్ అవుతూ తన మార్క్ లెటర్ కూడా రాసాడు.ఇదిలా ఉండగా ఇప్పుడు ఇతడు సినీ పెద్దలను సహాయం కోరినట్టు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం అందుతుంది.

మరి ఈ సమస్యను పరిష్కరించడానికి కొంత మంది అగ్ర నిర్మాతల మధ్య సమావేశం కూడా జరగనున్నట్టు సమాచారం.మరి ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతోందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube