మొబైల్ లో ఫ్లైట్ మోడ్ ఆప్షన్ తెలియని వారు వుండరు.అప్పుడప్పుడు మొబైల్ హ్యాంగ్ అయినపుడు దీన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తూ వుంటారు.
ఇక ఫ్లైట్ జర్నీలో వున్నపుడు ప్యాసింజర్లు తమ మొబైల్ ఫోన్స్ ని ఫ్లైట్ మోడ్‌లో పెట్టడం పరిపాటే.ఎందుకంటే ఫ్లైట్ ప్రారంభించే ముందు ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రయాణికులకు ఈ విషయంలో సూచనలు చేస్తారు.
అయితే ఈ జాగ్రత్తల వెనక సరైన కారణం ఉంది కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయమనడం వెనకున్న రీజన్ మాత్రం చాలామందికి తెలియదు.ఎందుకో ఇపుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
విమానయానంలో నేవిగేషన్, కమ్యూనికేషన్ అనేవి రేడియో సేవలపై ఆధారపడతాయి అన్న విషయం తెలిసినదే.ఇవి 1920 నుంచి స్టార్ట్ అయ్యాయి.60 ఏళ్ల కిందట కూడా ఉపయోగించిన కొన్ని పాత అనలాగ్ టెక్నాలజీస్ కంటే ప్రస్తుతం వాడుకలో ఉన్న డిజిటల్ టెక్నాలజీ ఎంతో అధునాతనమైనది.వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలు.
విమాన కమ్యూనికేషన్లు, నేవిగేషన్ సిస్టమ్స్ మాదిరిగానే అదే ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో సిగ్నల్‌ను విడుదల చేయగలవని పరిశోధనలో తేలింది.దీనినే ‘విద్యుదయస్కాంత జోక్యం’ అని పిలుస్తారు.
దీని కారణంగానే మొబైల్స్ ని ఫ్లైట్ మోడ్‌లో ఉంచామని చెబుతారు.

US ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మొబైల్ ఫోన్స్, ఎయిర్‌క్రాఫ్ట్ నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్స్ వంటి విభిన్న ఉపయోగాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌విడ్త్‌లను సృష్టించడం జరిగింది.కాబట్టి అవి ఒకదానితో ఒకటి జోక్యం చేసుకోవు.ఈ మేరకు EUలో ఎలక్ట్రానిక్ పరికరాలను 2014 నుంచి అనుమతించారు.
అయినప్పటికీ ప్రపంచవ్యాప్త విమానయాన పరిశ్రమ మొబైల్ ఫోన్స్ వినియోగంపై నిషేధాన్ని ఎందుకు కొనసాగిస్తోందంటే, వైర్‌లెస్ నెట్‌వర్క్స్.టవర్ల శ్రేణి ద్వారా కనెక్ట్ చేయబడతాయి.ఈ గ్రౌండ్ నెట్‌వర్క్‌ల మీదుగా ప్రయాణించే ప్రయాణికులందరూ తమ ఫోన్‌లను ఉపయోగిస్తుంటే నెట్‌వర్క్‌లు ఓవర్‌లోడ్ అవుతాయి.ఈ కారణంగానే అనుమతించరు.