బాలీవుడ్ హీరోయిన్, అలనాటి తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.ఇక త్వరలో తన నటన పరంగా కూడా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వనుంది ఈ హాట్ బ్యూటీ.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది.
అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.స్టార్ హోదా ను సొంతం చేసుకుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీకి దడక్ సినిమాతో( Dhadak Movie ) ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది.ఈ బ్యూటీ మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించగా రాను రాను గ్లామర్ షో తో బాగా రెచ్చిపోతుంది.
గతంలో కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.
ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.నిత్యం ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తుంది.
ఇక తనకు సంబంధించిన విషయాలను, సినిమా అప్డేట్లను బాగా షేర్ చేసుకుంటుంది.తన పొట్టి పొట్టి డ్రెస్సులతో బికినీ అందాలతో యువతను కన్నార్పకుండా చేస్తోంది.

ఈమె షేర్ చేసే వీడియోలు కానీ, ఫోటోలు కానీ తెగ వైరల్ అవుతూ ఉంటాయి.అయితే తాజాగా ఆమె ఒక దిండును పట్టుకొని( Pillow ) ఉన్న ఫోటోలు నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తున్నాయి.ఇక ఆమె అలా దిండు పట్టుకుని ఉండటంతో జనాలు కూడా బాగా ట్రోల్స్ చేస్తున్నారు.రీసెంట్ గా ఆమె ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మీడియా కంటపడగా వెంటనే ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి.

అందులో తను వైట్ కలర్ డ్రెస్ లో చేతిలో వైట్ కలర్ పిల్లోను పట్టుకొని కనిపించింది.ఇక ఆమె దిండు వెంట పట్టుకొని ఉండటంతో అందర్నీ కాస్త నవ్వించింది అని చెప్పాలి.అయితే ఆమె ఏ కారణంతో అలా వెంటపెట్టుకొని పోతుందో అనే విషయం తెలియక కొందరు ట్రోలర్స్.హోటల్ నుంచి పిల్లో దొంగతనం చేసావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఆమె దిండు వెంట పట్టుకొని వెళ్లడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.వరుస షూటింగ్ ల బిజీ తో ఆమెకు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి వచ్చిందని తెలిసింది.దీంతో డాక్టర్ సలహా మేరకు ఆమె దిండు ని అరేంజ్ చేసుకున్నట్లు తెలిసింది.ఇక ఆ దిండును జాన్వీ స్పెషల్ గా డిజైన్ చేయించుకొని మరి వాడుకుంటుందట.
ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ 30 సినిమాలో( NTR30 ) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయటానికి సిద్ధంగా ఉందట.అంతేకాకుండా అక్కినేని అఖిల్ తో కూడా ఈ ముద్దుగుమ్మ నటించడానికి ఓకే అన్నట్టు తెలుస్తుంది.
