ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని సీటెల్ నగరంలో( Seattle ) పోలీస్ వాహనం ఢీకొట్టి కందుల జాహ్నవి( Jaahnavi Kandula ) అనే తెలుగు అమ్మాయి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.ఈ ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది.
ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి చేరుకుంటుంది అనుకున్న తమ బిడ్డ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఈ ప్రమాదం జరిగిన దాదాపు ఆరు నెలల తర్వాత పోలీసులు ధరించిన బాడీక్యామ్‌లో( Bodycam ) రికార్డ్ అయిన ఘటన దృశ్యాలు వెలుగుచూశాయి.
నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరిగ్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతోంది.ఈ క్రమంలో జనవరి 23న జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం దూసుకొచ్చి ఆమెను ఢీకొట్టింది.
ఈ సమయంలో వాహనంలో సీటెల్ పోలీస్ విభాగానికి చెందిన కెవిన్ డేవ్ ( Kevin Dave ) వున్నాడు.అతని బాడీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి.
కెవిన్ స్పీడో మీటర్ గంటకు 74 మైళ్ల వేగాన్ని చూపుతోంది.ఫాక్స్ సీటెల్ వార్తా సంస్థ కథనం ప్రకారం.
జాహ్నవిని డెక్స్‌టర్ అవెన్యూ నార్త్ , థామస్ స్ట్రీట్ కూడలి వద్ద కారు ఢీకొట్టింది.తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు, పోలీస్ అధికారులు హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో కెవిన్ ఓ ఎమర్జెన్సీ కాల్ మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది.దీని కారణం చేత వాహనం సైరన్‌ను ఆయన తగ్గించాడు.కానీ అత్యవసర పరిస్థితి గురించి హెచ్చరించడంలో కెవిన్ విఫలమయ్యాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.బాడీక్యామ్ ఫుటేజ్‌లో జాహ్నవికి సీపీఆర్ నిర్వహించడాన్ని చూడవచ్చు.దీనిపై కెవిన్ మాట్లాడుతూ.తాను సైరన్ మోగిస్తూ వస్తున్నానని, ఆ సమయంలో జాహ్నవి క్రాస్‌వాక్‌లో వుందని చెప్పారు.
తనను చూసి క్రాస్ వాక్ గుండా పరిగెత్తిందని కెవిన్ తెలిపారు.
కర్నూలు జిల్లాకు( Kurnool District ) చెందిన జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి.సీటెల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేరారు.జనవరి 23న కళాశాలకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆమె మరణవార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.జాహ్నవి భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘‘తానా’’( TANA ) అండగా నిలిచింది.
జనవరి 29న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో మృతదేహాన్ని హైదరాబాద్‌కు అక్కడి నుంచి ఆదోనీకి పంపారు.అలాగే జాహ్నవి కుటుంబానికి అండగా నిలిచేందుకు గాను ఆమె స్నేహితులు ‘‘గో ఫండ్ మీ’’ ద్వారా నిధుల సమీకరణ చేపట్టారు.