డైరెక్టర్ కె.ఎస్.
రవీంద్ర దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో ఈ రోజు తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’.ఇక చిరంజీవి సరసన శృతిహాసన్ జంటగా నటించింది.
ఇక కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహ, బిజుమీనన్ తదితరులు కీలకపాత్రలో నటించారు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా చేశారు.
ఇక జీకే మోహన్ సినిమాటోగ్రఫీగా చేశాడు.ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.
ఇక ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను, అభిమానులను బాగా ఆకట్టుకుంది.ఇక చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో కాబట్టి మెగా అభిమానులతో పాటు రవితేజ అభిమానులు కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.మొత్తానికి ఈ సినిమా ఈరోజు విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం.
కథ:
జాలారి పేటలో వాల్తేరు వీరయ్య (చిరంజీవి) నివాసం ఉంటాడు.ఇక అక్కడ ఆయన ఏది చెబితే అదే నడుస్తుంది.కానీ కొందరు ఆయనకు తెలియకుండా సముద్రపు ఒడ్డున డ్రగ్స్ సరఫరా చేసే వ్యాపారం మొదలుపెట్టారు.ఈ విషయం తెలిసిన ఏసీపీ విక్రమ్ (రవితేజ) వెంటనే వారిని అరెస్టు చేస్తాడు.అంతేకాకుండా వారిని అరెస్టు చేయొద్దని అడ్డు వచ్చిన వీరయ్యను కూడా అరెస్టు చేస్తాడు విక్రమ్.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే వీరయ్య, విక్రమ్ ఓకే తండ్రికి పుట్టిన బిడ్డలు.కానీ తల్లులు మాత్రం వేరు.
ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల వల్ల ఆ ప్రేమను బయటకు చూపించలేకపోతారు ఈ అన్న తమ్ముళ్లు.విక్రమ్ వాళ్లను అరెస్టు చేసినందుకు వీరయ్య జైల్లో ఉన్న సమయంలో తన విక్రమ్ ను కొందరు దుండగులు చంపేస్తారు.దీంతో వీరయ్య తన తమ్ముడు చనిపోవడానికి కారకుడైన ప్రకాష్ రాజ్ మలేషియాలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు.ఆ తర్వాత వీరయ్య ప్రకాష్ రాజ్ ని ఏం చేస్తాడు అనేది.
వీరయ్య, విక్రమ్ లు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
నటీనటుల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా మొత్తం చిరంజీవి చుట్టే తిరుగుతుంది.ఇక రవితేజ మాత్రం బాగా అదరగొట్టాడు.
ఇక శృతిహాసన్ తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
డైరెక్టర్ ఈ సినిమాకు రొటీన్ స్టోరీ అందించినప్పటికీ కూడా అద్భుతంగా స్క్రీన్ చేసాడు.దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఫిదా చేసింది.
ఇక జీకే మోహన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.ఇక మిగిలిన సాంకేతిక విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
ఫస్టాఫ్ మాత్రం ఫుల్ కామెడీతో, యాక్షన్ సన్నివేశాలతో బాగా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ముఖ్యంగా రవితేజ, చిరంజీవి మధ్య సన్నివేశాలు పవర్‌పుల్‌గా ఆకట్టుకున్నాయి.
శృతిహాసన్ మాత్రం గ్లామర్ తో ఫిదా చేసింది.చిరంజీవి ఎంట్రీ సీన్ మాత్రం అదరిపోయింది.
రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా బాగుంది.
ప్లస్ పాయింట్స్:
చిరంజీవి – రవితేజ పర్ఫామెన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కామెడీ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
స్టోరీ రొటీన్ గా అనిపించింది.అక్కడక్కడ బాగా సాగదీసినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
మొత్తానికి రొటీన్ కథ అయినప్పటికీ కూడా చిరంజీవి తన పర్ఫామెన్స్ తో బాగా అదరగొట్టాడు.