తూచ్.. ఆ వార్తలో నిజం లేదంటున్న పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఓ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడు.

 Allu Arjun, Pushpa, Rumours, Telugu Movie News-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో మరో బ్యూటీ నివేతా పేతురాజ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.దీంతో పాటు తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ నివేథా థామస్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు, అసలు హీరోయిన్ ఆమేనని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.

కాగా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చిత్ర యూనిట్ వాటిపై స్పందించింది.

ఈ సినిమాలో నివేథా థామస్ నటించడం లేదని వారు తెలిపారు.

ఇక ఈ సినిమాలో రష్మికయే హీరోయిన్ అని వారు క్లారిటీ ఇచ్చారు.దీంతో పుష్ప చిత్రంపై వస్తున్న పుకార్లు ఫుల్‌స్టాప్ పడిందని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube