చావు కబురు చల్లగా చెబుతానంటోన్న అందాల రాక్షసి

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్‌నైట్ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు.తనలోని నటుడిని పూర్తిగా బయటకు తీయాలని విభిన్నమైన పాత్రలను ఎంచుకుని చేస్తున్న కార్తికేయ రీసెంట్‌గా 90 ఎంఎల్ అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు.

 Lavanya Tripathi To Pair Up With Karthikeya-TeluguStop.com

కాగా ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు ఈ యంగ్ హీరో.

‘చావు కబురు చల్లగా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కౌశిక్ పెగుళ్లబాటి అనే కొత్త దర్శకుడి డైరెక్షన్‌లో కార్తికేయ తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

కథ నచ్చడంతో అమ్మడు కూడా వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Telugu Chavukaburu, Karthikeya, Telugu-

అయితే రీసెంట్‌గా అర్జున్ సురవరంతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ, కార్తికేయ లాంటి యంగ్ హీరోతో ఎలాంటి కెమిస్ట్రీ పండిస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఏదేమైనా అందాల రాక్షసి కూడా చావు కబురు చల్లగా చెబుతానంటోంది.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఈ సినిమాను GA2 బ్యానర్‌పై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేయనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube