ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగుతున్నారు చిరంజీవి.ఈయన నటించిన సినిమాలతో దాదాపు రెండు దశాబ్దాలు ఇండస్ట్రీని ఏలాడు.
అప్పట్లో చిరంజీవి ( Chiranjeevi ) నటించిన సినిమాలు ఎన్నో రికార్డులు సృష్టించేవి అంటే అతిశయోక్తి కాదు.అందుకే బ్యాగ్రౌండ్ లేకుండా కూడా చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగారు.
అంతేకాదు చిరంజీవికి సహనం కూడా చాలా ఎక్కువ.ఎవరు ఏమన్నా కూడా నన్ను కాదులే అన్నట్లుగా చూస్తారు తప్ప వారిపై నోటి దురుసుతనంతో మాట్లాడరు.
అయితే అలాంటి మంచి క్వాలిటీస్ అన్నీ ఉన్న చిరంజీవిని ఓ నిర్మాత మాత్రం ఎండలో నిలబెట్టి అలాంటి పని చేయించారట.

మరి ఆ నిర్మాత ఎవరు? ఎందుకు చిరంజీవిని ఎండలో నిలబెట్టారు… అంత పెద్ద తప్పు చిరంజీవి ఏం చేశారు.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.మెగాస్టార్ చిరంజీవి.
ఈ పేరు చెబితే ఎంతోమంది వీరాభిమానులు తమ హీరో చిరంజీవి గురించి గొప్పగా చెప్పుకుంటారు.అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన భోళా శంకర్ సినిమా చూసి కొంతమంది నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.
కానీ ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించారు.అంతేకాదు తన మేనరిజం,డాన్స్, ఫైటింగ్, యాక్టింగ్ అన్నింటితో ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేశారు.
అలాంటి ఈయన నటించిన ఒక్క భోళా శంకర్ ( Bhola shankar) సినిమా ఫ్లాఫ్ అయితే ఆయన సినీ కెరియర్ అయిపోయినట్టు కాదు.అయితే చిరంజీవి కోతల రాయుడు ( Kothala Rayudu ) అనే సినిమాలో హీరోగా చేసిన సంగతి మీకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలో నటించే టైంలో షూటింగ్ కి అనుకున్న టైం కి రాలేదని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ( Tammareddy Bharadwaja ) ఆయనను ఓ రోజు మొత్తం ఎండలో నిల్చోమని చెప్పారట.అంతేకాదు సినిమా అంటే లోకువగా ఉందా అంటూ చిరంజీవిని అనడంతో ఆయన సినిమాపై ఉన్న ఇష్టంతో ఇంకొకసారి షూటింగ్ కి లేటుగా రావద్దు అనే ఉద్దేశంతో ఆరోజు మొత్తం ఎండలో నిలబడ్డారట.అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి ( Thulasi ) చెప్పింది.తులసి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది.
ఈమె ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి అత్త పాత్రల్లో నటించింది.అలాగే భోళా శంకర్ సినిమాలో కూడా తులసి నటించింది
.






