వైష్ణవ్ తేజ్ తో శ్రీలీల..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు.ఉప్పెన, కొండపొలం సినిమాలు చేసిన వైష్ణవ్ తేజ్ తన థర్డ్ మూవీ గిరీశయ్య డైరక్షన్ లో రంగ రంగ వైభవంగా సినిమా చేస్తున్నాడు.

 Pellisandadi Sri Leela Chance With Mega Hero Vaishnav Tej Movie,  Vaishnav Tej ,-TeluguStop.com

ఈ సినిమా తర్వాత సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ సినిమా ప్లాన్ చేశారు.వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తాడని టాక్.

ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లిసందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.

అయితే ఆల్రెడీ కన్నడలో రెండు సినిమాలు చేసిన శ్రీలీల పెళ్లిసందడితో తెలుగు ప్రేక్షకులను అలరించింది.ఈ సినిమా తర్వాత కూడా కన్నడలో మరో రెండు సినిమాలు సైన్ చేసింది.

ఇక లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ సరసన లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.వైష్ణవ్ తేజ్ తో శ్రీ లీల క్రేజీ కాంబో ఫిక్స్.మెగా హీరోల చేతుల్లో పడితే హీరోయిన్ గా నెక్స్ట్ లెవల్ క్రేజ్ దక్కించుకునే ఛాన్స్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube