ఆరోగ్యవంతమైన సమాజమే సీఎం కేసీఆర్ లక్ష్యం:జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:పండుగ ఏదైనా అందరూ కలసి చేసుకోవాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని,నేడు తెలంగాణ మంచి మార్గంలో పోతూ దేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో ఆదర్శవంతమైన పాలన చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మనమంతా ముందుకు పోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మదీనా మసీదు ఆవరణలో ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇచ్చి మాట్లాడారు.

 Healthy Society Is The Goal Of Cm Kcr: Jagadish Reddy-TeluguStop.com

దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి బతకాలని ఒక మంచి సమాజం అంటే అందరూ సుఖసంతోషాలతో ఉండే సమాజమే ఆరోగ్యవంతమైన సమాజం అవుతుందని అన్నారు.ఎవరో కొద్దిమంది సంతోషంగా ఉండి మిగతా వారు సంతోషంగా లేకపోవడం మంచి సమాజం లక్షణం కాదని దృఢమైన అభిప్రాయంతో ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

అందుకే టీఆర్ఎస్ పార్టీ తరపున గతంలో అనేక సందర్భాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.దసరా పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలను పిలిచి వారిని కూడా అందులో భాగస్వాములను చేయడం,క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు గౌరవించుకునే అలవాటు టీఆర్ఎస్ కు మొదటినుంచి ఉందన్నారు.

దేశంలో విభిన్న సంస్కృతుల ప్రజలు వివిధ మతాలు కులాలతో విడిపోయిన ప్రజలు తప్పకుండా కలిసి బతకాలని, ఒకరి ఆచారాలను సంస్కృతులను మరొకరు గౌరవించుకోవాలని,ఈ సహనం ప్రజల్లో ఉంటే అది మంచి సమాజం అవుతుందన్నారు.నాడు గాంధీజీ చెప్పినట్టు తెలంగాణలో హైద్రాబాద్ గంగా జమునా తెహజీబ్ గా ఉందని,దీన్ని నుంచి భారతదేశం నేర్చుకోవాలని చెప్పిన మాటలను నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ నిజం చేస్తున్నారని అన్నారు.

సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దేశంలో ఎవరూ చేయని సాహసవంతమైన పని రంజాన్ పండుగ సందర్భంగా తోఫా ఇవ్వడం,ఇఫ్తార్ ఇవ్వడం అన్నారు.ప్రభుత్వమే చేయవచ్చునని చేసి నిరూపించిన మొట్టమొదటి నాయకుడు కెసిఆర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్,కౌన్సిలర్లు ఎస్.కె.జహీర్, ఎలిమినేటి అభినయ్,జెడ్పీటీసీలు జీడీ భిక్షం, సంజీవనాయక్,ఉప్పల ఆనంద్,కొండపల్లి దిలీప్ రెడ్డి, రియాజ్,కరాటే సయ్యద్,మారిపెద్ది శ్రీనివాస్, మహమ్మద్ గౌస్,గుడిపూడి వెంకటేశ్వర్రావు,షాహిద్ మౌలానా,సయ్యద్ సలిం,యూసుఫ్,గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube