టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి అందరికీ సుపరిచితమే.అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి, వంటి సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
ఈ క్రమంలోనే ఎన్నో టీవీ షోస్ చేస్తూ మంచి గుర్తింపు పొందిన మంచులక్ష్మి ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలతో బిజీగా ఉన్న మంచులక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఇకపోతే తాజాగా ఈమె నేర్చుకున్న కలరిపట్టు విద్య గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేయడమే కాకుండా ఎన్నో రకాల వీడియోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.
అలాగే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉన్న ఫోటోలు వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉండే మంచు లక్ష్మి తాజాగా మరొక ఫోటోను షేర్ చేశారు.

తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలో మంచు లక్ష్మి చేతిలో వైన్ గ్లాస్ తో పాటు గులాబీ పువ్వు చేత పట్టుకొని ఉంది.ఈ ఫోటోలో మంచు లక్ష్మి లుక్స్ కూడా ఎంతో భిన్నంగా ఉన్నాయి.
ఈ ఫోటోలో ఈమె కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.