ప్రభాస్ కోసం చిరంజీవి అప్పట్లో కథలు ఎంపిక చేసేవాడా..? ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి.?, ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదించే ప్రతీ ఒక్కరికి చిరంజీవి అంటే ఇష్టమే.కొన్ని కులాలు మరియు వర్గాల కారణంగా కొంతమంది చిరంజీవి ని ద్వేషిస్తారు కానీ, వాళ్ళు కూడా చిరంజీవి సినిమాలను ఎంజాయ్ చేస్తారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆ స్థాయి ఎంటర్టైనర్ గా మెగాస్టార్ పేరు తెచ్చుకున్నాడు.

 Did Chiranjeevi Choose Stories For Prabhas Back Then? The Shocking Truth That No-TeluguStop.com

చిరంజీవి కి సెలబ్రిటీస్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు కూడా చిరంజీవి కి పెద్ద ఫ్యాన్స్.

వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకడు.చిరంజీవి పట్ల తనకి ఉన్న అభిమానం ని సందర్భం దొరికినప్పుడల్లా చెప్పుకుంటూనే ఉంటాడు ప్రభాస్.

కృష్ణం రాజు( Krishnam Raju ) కుటుంబం నుండి వచ్చినప్పటికీ కూడా చిరంజీవి అంటే ప్రభాస్ ఎంతో ప్రేమ మరియు అభిమానం.

Telugu Salaar, Kalki Ad, Krishnam Raju, Chiranjeevi, Prabhas-Movie

ఇది ఇలా ఉండగా కెరీర్ ప్రారంభం లో ప్రభాస్( Prabhas ) కి ఎలాంటి సినిమాలు చెయ్యాలి, ఎలాంటి చిత్రాలు చేస్తే ఆడియన్స్ నచ్చుతారు అనే విషయాలపై పెద్దగా క్లారిటీ ఉండేది కాదట.అప్పట్లో తన వద్దకి ఏ స్టోరీ వచ్చినా, ముందుగా తానూ విని, ఆ తర్వాత పెదనాన్న కృష్ణం రాజు ని, అలాగే చిరంజీవి ని సెకండ్ ఒపీనియన్ గా అడిగేవాడట.వాళ్ళు ఓకే చెప్పిన తర్వాతే స్క్రిప్ట్ ని లాక్ చేసేవాడట ప్రభాస్.

ఇలా దాదాపుగా పౌర్ణమి చిత్రం వరకు కొనసాగింది అట.ఆ తర్వాత ప్రభాస్ తన సినిమాలను తానే సెలెక్ట్ చేసుకునేవాడట.ఈ విషయం చాలా మందికి తెలియదు.ప్రభాస్ మరియు చిరంజీవి కి మధ్య అంత మంచి రిలేషన్ ఉంది.సాధారణంగా ఏ హీరో పుట్టిన రోజు కి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసే అలవాటు లేని ప్రభాస్, ప్రతీ ఏడాది చిరంజీవి పుట్టినరోజుకి మాత్రం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తాడు.

Telugu Salaar, Kalki Ad, Krishnam Raju, Chiranjeevi, Prabhas-Movie

ఈ ఏడాది కూడా చిరంజీవి కి తానూ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ( Kalki 2898 AD ) చిత్రం నుండి గ్యాంగ్ లీడర్ ఫోజులో ఒక వీడియో క్లిప్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఇకపోతే ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ ఈ నెల 22 వ తారీఖున విడుదల కాబోతుంది.ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ కూడా మొదలయ్యాయి.

ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేసిన వీడియో త్వరలోనే విడుదల చేయబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube