ప్రభాస్ కోసం చిరంజీవి అప్పట్లో కథలు ఎంపిక చేసేవాడా..? ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి.
?, ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదించే ప్రతీ ఒక్కరికి చిరంజీవి అంటే ఇష్టమే.కొన్ని కులాలు మరియు వర్గాల కారణంగా కొంతమంది చిరంజీవి ని ద్వేషిస్తారు కానీ, వాళ్ళు కూడా చిరంజీవి సినిమాలను ఎంజాయ్ చేస్తారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆ స్థాయి ఎంటర్టైనర్ గా మెగాస్టార్ పేరు తెచ్చుకున్నాడు.చిరంజీవి కి సెలబ్రిటీస్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు కూడా చిరంజీవి కి పెద్ద ఫ్యాన్స్.వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకడు.
చిరంజీవి పట్ల తనకి ఉన్న అభిమానం ని సందర్భం దొరికినప్పుడల్లా చెప్పుకుంటూనే ఉంటాడు ప్రభాస్.
కృష్ణం రాజు( Krishnam Raju ) కుటుంబం నుండి వచ్చినప్పటికీ కూడా చిరంజీవి అంటే ప్రభాస్ ఎంతో ప్రేమ మరియు అభిమానం.
"""/" /
ఇది ఇలా ఉండగా కెరీర్ ప్రారంభం లో ప్రభాస్( Prabhas ) కి ఎలాంటి సినిమాలు చెయ్యాలి, ఎలాంటి చిత్రాలు చేస్తే ఆడియన్స్ నచ్చుతారు అనే విషయాలపై పెద్దగా క్లారిటీ ఉండేది కాదట.
అప్పట్లో తన వద్దకి ఏ స్టోరీ వచ్చినా, ముందుగా తానూ విని, ఆ తర్వాత పెదనాన్న కృష్ణం రాజు ని, అలాగే చిరంజీవి ని సెకండ్ ఒపీనియన్ గా అడిగేవాడట.
వాళ్ళు ఓకే చెప్పిన తర్వాతే స్క్రిప్ట్ ని లాక్ చేసేవాడట ప్రభాస్.ఇలా దాదాపుగా పౌర్ణమి చిత్రం వరకు కొనసాగింది అట.
ఆ తర్వాత ప్రభాస్ తన సినిమాలను తానే సెలెక్ట్ చేసుకునేవాడట.ఈ విషయం చాలా మందికి తెలియదు.
ప్రభాస్ మరియు చిరంజీవి కి మధ్య అంత మంచి రిలేషన్ ఉంది.సాధారణంగా ఏ హీరో పుట్టిన రోజు కి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసే అలవాటు లేని ప్రభాస్, ప్రతీ ఏడాది చిరంజీవి పుట్టినరోజుకి మాత్రం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తాడు.
"""/" /
ఈ ఏడాది కూడా చిరంజీవి కి తానూ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ( Kalki 2898 AD ) చిత్రం నుండి గ్యాంగ్ లీడర్ ఫోజులో ఒక వీడియో క్లిప్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఇకపోతే ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'సలార్' ఈ నెల 22 వ తారీఖున విడుదల కాబోతుంది.
ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ కూడా మొదలయ్యాయి.ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేసిన వీడియో త్వరలోనే విడుదల చేయబోతున్నారట.
గేమ్ ఛేంజర్ రిజల్ట్ ఎలా ఉన్నా ఆ కామెంట్ చేయలేరుగా.. మెగా ఫ్యాన్ కామెంట్స్ వైరల్!