తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో చాలా జాగ్రత్తగా రాజకీయాలి నడపాలి అని అంటూ ఉంటారు,ప్రత్యర్ధులు కూడా ఆయన నోట్లోంచి ఎప్పుడు ఏ మాట ఒస్తుందో అని ఊహించలేక భయపడుతూ ఉండే రోజులు ఎన్నో ఉన్నాయి.ఉదాహరణ కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంగతి తీసుకుంటే ఎదురు పడినప్పుడు ఇద్దరూ బాగా క్లోజ్ గా కనిపిస్తారు కానీ వెనకాల జరిగే భాగోతం వేరుగా ఉంటుంది.
విమర్సలు చెయ్యాల్సిన సమయం వచ్చినప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా కెసిఆర్ రెచ్చిపోతూ ఉంటారు కూడా.ఓటుకు నోటు వ్యవహారం సమయం లో కొంతకాలం వరకూ ఒకరికి ఒకరు ఎదురు పడ్డానికి కూడా ఇష్టపడలేదు.
మొత్తానికి కొందరు పెద్దమనుషుల లెక్కలు తేలడంతో కాస్త స్నేహంగా ఉండే పరిస్థితి ఒచ్చింది ఇన్నాళ్ళకి.అప్పట్లో కెసిఆర్ స్వయంగా అమరావతి శంకుస్థాపన కి వెళ్ళిన సంగతి కూడా తెలిసిందే.
చండీ యాగానికి చంద్రబాబు రావడం కూడా విశేషం అయ్యింది.
ఆ సమయంలో చంద్రుళ్ళు ఇద్దరూ ఏకాంతంగా కలిసి మాట్లాడుకోవడం వార్తల్లో చూసాం.
అయితే.ఇటీవల కేసీఆర్ తన ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో కలిసిన కొన్ని గ్రామాలు.
తెలంగాణకు తిరిగి ఇచ్చేస్తానని బాబు తనతో చెప్పినట్లుగా చెప్పి సంచలనం రేపారు.నిజంగానే కేసీఆర్ కు బాబు.
ఆ మాట ఇచ్చారా? అన్న డౌట్ వచ్చింది.పాలనా పరమైన సమస్యలూ, సరిహద్దు ఇబ్బందులూ ఉండకూడదు అనే ఉద్దేశ్యం తో ఈ మాట చంద్రబాబు ఇచ్చారు అని సమాచారం.







